
అలెస్టర్ కుక్ 'సెంచరీ'ల రికార్డు!
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
రాజ్కోట్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. భారత్తో రాజ్కోట్లో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో కుక్ శతకం సాధించడం ద్వారా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. 194 బంతుల్లో 10 ఫోర్లు సాయంతో సెంచరీ మార్కును చేరిన కుక్.. భారత్ లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. కుక్ కు ఇది భారత్ లో ఐదో టెస్టు సెంచరీ. ఇంతవరకూ ఏ విదేశీ ఆటగాడు భారత్ లో నాలుగు శతకాలు మించి చేయలేదు. అంతకుముందు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్, దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లాలు భారత్ లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాళ్లు.
ఇదిలా ఉండగా, 114/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ కు అలెస్టర్ కుక్-హమీద్లు అత్యంత నిలకడగా ఆడాడు. అయితే ఈ జోడీ 180 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం సాధించిన తరువాత హమీద్(82) వెనుదిరిగాడు. అమిత్ మిశ్రా బౌలింగ్ లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి హమీద్ అవుటయ్యాడు. ఆ తరువాత కాసేపటికి జో రూట్(4) రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు.కాగా, క్రీజ్ లో కుదురుకున్న కుక్ మాత్రం అతని టెస్టు కెరీర్ లో 30 శతకం సాధించాడు.