స్పిన్‌ను ఎలా ఆడాలో నేర్చుకోండి
కుక్ సేనకు గంగూలీ సలహా
లండన్: భారత స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే ఇంగ్లండ్ ఆటగాళ్లు మరింత రాటుదేలాల్సిన అవసరం ఉందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత వన్డే సిరీస్‌లో వారు నిలవాలంటే తక్షణం స్పిన్‌పై దృష్టి సారించాలని చెప్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కుక్ సేన 0-2తో వెనుకబడిన సంగతి తెలిసిందే.
‘ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు రెండు తప్పులు చేసిందని అనుకుంటున్నాను. 300 పరుగులు చేయడం చాలా కష్టమనే భావనలో ఉన్నారు. ముందుగా ఆ ఆలోచనాధోరణి నుంచి ఇంగ్లండ్ జట్టు బయటపడాలి. ఇక రెండోది వారు స్పిన్‌ను ఎదుర్కొనే తీరు. ఏ పిచ్‌పైనైనా స్పిన్‌ను ఆడాల్సి ఉంటుంది. అయితే తమకు తామే ఆడలేమని అనుకుంటూ ఇబ్బంది పడుతున్నారు’ అని గంగూలీ అన్నాడు.