చెప్తే అర్థం కాదా?.. సన్‌రైజర్స్‌ స్టార్‌కు చెప్పు చూపించిన యువీ! | Laaton Ke Bhoot: Yuvraj Singh Scolds SRH Star Who Dismantled MI In IPL 2024 | Sakshi
Sakshi News home page

#SRHvsMI: మంచిగా చెప్తే అర్థం కాదా?.. సన్‌రైజర్స్‌ స్టార్‌కు చెప్పు చూపించిన యువీ!

Published Thu, Mar 28 2024 5:53 PM | Last Updated on Thu, Mar 28 2024 6:19 PM

Laaton Ke Bhoot: Yuvraj Singh Scolds SRH Star Who Dismantled MI In IPL 2024 - Sakshi

సన్‌రైజర్స్‌ స్టార్‌పై యువీ ప్రశంసలు (PC: SRH)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో ‘‘నీకోసం.. ప్రత్యేకంగా ఓ చెప్పు ఎదురుచూస్తోంది’’ అంటూ ఊహించని షాకిచ్చాడు. ఇంతకీ విషయమేమిటంటే..

ఐపీఎల్‌-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఉప్పల్‌ మైదానంలో పరుగుల వరద పారించి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు(277) నమోదు చేసింది.

ఇక ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్‌ శర్మ వీర విహారం చేశాడు.  కేవలం 23 బంతుల్లోనే 63 పరుగులతో అదరగొట్టాడు. 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో పరుగుల సునామీ సృష్టించి.. సన్‌రైజర్స్‌ తరఫున వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేశాడు.

అయితే, ముంబై బౌలర్‌ పీయూష్‌ చావ్లా సంధించిన షార్ట్‌బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేక నమన్‌ ధిర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో యువరాజ్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘‘సూపర్‌ సర్‌.. వారెవ్వా అభిషేక్‌.. గొప్ప ఇన్నింగ్స్‌. 

కానీ ఇలాంటి షాట్‌కు అవుటవుతావా? నీకు మంచిగా చెబితే అర్థం కాదు కదా? అందుకే ఇప్పుడు నీ కోసం ప్రత్యేకంగా ఓ స్లిప్పర్‌ ఎదురుచూస్తోంది. వచ్చెయ్‌’’ అని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టాడు. అదే విధంగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ అద్భుత ఇన్నింగ్స్‌ను కూడా కొనియాడాడు. కాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్‌కు యువీ ఆరాధ్య క్రికెటర్‌. అంతేకాకుండా.. అతడికి మెంటార్‌ కూడా!

అందుకే యువరాజ్‌ ఈ మేరకు అభిషేక్‌ ఆట తీరును విశ్లేషిస్తూ.. చొరవగా ఇలా ట్వీట్‌ చేశాడు. కాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు ట్రవిస్‌ హెడ్‌(24 బంతుల్లో 62), మార్క్రమ్‌(28 బంతుల్లో 42 నాటౌట్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌(34 బంతుల్లో 80 నాటౌట్‌) దుమ్ములేపారు. ఫలితంగా 277 పరుగులు స్కోరు చేసిన సన్‌రైజర్స్‌.. ముంబైని 246 పరుగులకు కట్టడి చేసి 31 పరుగుల తేడాతో గెలిచింది.

చదవండి: #SRHvsMI: ఎగిరి గంతేసిన కావ్య.. తలపట్టుకున్న నీతా అంబానీ! వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement