India cricketer
-
తెరపైకి యువరాజ్ సింగ్ జీవితం
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రానుంది. భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ నిర్మించనున్న ఈ బయోపిక్‌ను మంగళవారం ప్రకటించారు. భారత క్రికెట్లో పదిహేడేళ్ల సుదీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్, ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం, క్యాన్సర్ మహమ్మారితో పోరాడటం, 2007లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత టీమ్‌లో రాణించడం, ధోనీతో విభేదాలు అనే వార్త, ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమ అనే గాసిప్... ఇలా యువరాజ్ లైఫ్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.ఈ అంశాలను ఈ సినిమాలో ఎంత మేరకు చూపించాలనుకుంటున్నారని తెలియాల్సి ఉంది. అలాగే యువరాజ్ సింగ్‌గా ఎవరు నటించనున్నారు? దర్శకత్వం వహించేది ఎవరు? అనే విషయాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ఫ్యాన్స్ కోసం నా బయోపిక్ తెరకెక్కనున్నందుకు హ్యాపీగా ఉంది. సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యలను అధిగమిస్తూ వారి కలలను నెరవేర్చుకునేలా నా బయోపిక్ స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు యువరాజ్ సింగ్. -
మరొకరితో భారత క్రికెటర్ భార్య.. లిప్‌లాక్ వీడియో వైరల్
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె సెర్బియా దేశస్థురాలు అయినా భారత్‌లోనే ఉంటుంది. ఆమె ఒక డ్యాన్సర్,మోడల్,నటి. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహతో బాలీవుడ్ చిత్రాలలో అడుగుపెట్టారు. అలా 2020 వరకు సుమారు 20కి పైగా చిత్రాల్లో నటించారు. బాలీవుడ్లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ 8లో కూడా ఆమె పాల్గొన్నారు. (ఇదీ చదవండి: నటి మహాలక్ష్మి భర్త రవీందర్ అరెస్ట్) నటాషా ఒక నటి కాబట్టి.. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా హాట్, బోల్డ్ చిత్రాలను ఆమె షేర్ చేస్తూ ఉంటారు. వాటిని అభిమానులు కూడా చాలా ఇష్టపడతారు. ఈ సమయంలో నటాషా అనేక ఫోటోలతో పాటు ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. అందులో ఆమె మరోక వ్యక్తిని ముద్దులు పెట్టుకున్న సన్నివేశం ఉండటంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆ వీడియోలో చుట్టూ చీకటిగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏదో ఒక పార్టీలో నటాషాతో పాటు మరోక వ్యక్తి ఉన్నారు. వారిద్దరూ కూడా చాలా చనువుగా ఉండటమే కాకుండా లిప్‌లాక్ కిస్ కూడా పెట్టుకున్నారు. ఈ వీడియోను కూడా నటాషానే షేర్ చేస్తూ.. ఇవన్నీ 'గుర్తుంచుకోవలసిన జ్ఞాపకాలు' అని క్యాప్షన్ ఇచ్చారు. (ఇదీ చదవండి: 'బేబి'లో వైష్ణవి పెళ్లి చేసుకున్న నటుడితడే! అమ్మాయి చేతిలో మోసపోయానంటూ..) అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. కానీ ఆ వీడియోకు హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ హార్దిక్ పాండ్యా స్వయంగా వ్యాఖ్యానించడం విశేషం. కానీ నెటిజన్లు మాత్రం ఆమెను తప్పుబడుతున్నారు. మీరు మరొక వ్యక్తిని ఎందకు ముద్దు పెట్టుకున్నారని నటాషాను ప్రశ్నిస్తున్నారు. మీరు చాలా హాట్ అంటూ మరోకరు తెలిపారు. కానీ నటాషా తిరిగి ఎవరికీ రిప్లై ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవతుంది. ఏదేమైనా టీమిండియా క్రికెట్లో హార్దిక్ పాండ్యా- నటాషా జోడీ అద్భుతంగా ఉంటుంది. View this post on Instagram A post shared by Nataša Stanković Pandya 🧡 (@natasastankovic__) -
'చెత్త' పనికి పరిహారం కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్
పనాజీ: నిర్లక్ష్యంగా రోడ్డుపై చెత్త పడేసినందుకు గాను టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత అజయ్ జడేజా రూ.5 వేల జరిమానా కట్టాడు. నార్త్ గోవాలోని అల్డోనా గ్రామంలో విలాసవంతమైన భవనంలో నివాసముండే ఈ మాజీ క్రికెటర్.. తన పక్కనే ఉన్న నచినోలా అనే గ్రామంలో చెత్త పడేయటాన్ని గ్రామస్తులు గుర్తించారు. దీంతో అతనికి జరిమానాను విధించడంతో పాటు మరోసారి చెత్త వేయవద్దని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు తప్పును ఒప్పుకున్న జడేజా జరిమానా కట్టి, మరోసారి ఈ 'చెత్త' పని చేయనని అంగీకరించాడు. ఈ విషయాన్ని నచినోలా గ్రామ సర్పంచ్ తృప్తి బండోద్కర్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామ్ సర్పంచ్ మాట్లాడుతూ.. జడేజా లాంటి పాపులర్ క్రికెటర్ తమ పరిసరాల్లో ఉంటుంన్నందుకు చాలా గర్వంగా ఉందన్నాడు. అయితే ఎంతటి సెలబ్రిటీ అయినా పారిశుద్ధ్య నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని చెప్పుకొచ్చాడు. కాగా, గోవాలోని అల్డోనా గ్రామ పంచాయతీ చాలా మంది సెలబ్రిటీలకు సెకండ్ హోమ్‌గా ఉంది. అజయ్ జడేజా, అమితావ్ ఘోష్ లాంటి పలువురు ప్రముఖులు అక్కడే భవనాలు కొనుగోలు చేసి ప్రకృతిని ఆస్వాధిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, భారత్ జట్టులోకి 1992లో అరంగేట్రం చేసిన అజయ్ జడేజా 15 టెస్టులు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడి, 6 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీల సాయంతో దాదాపు 6000 పరుగులు సాధించాడు. టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ గుజరాత్ ఆటగాడు.. 2000లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. చదవండి: డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ మహిళా క్రికెటర్.. -
నా ప్రాక్టీస్‌కు నాన్న సాయం: సాహా
కోల్‌కతా: దాదాపు రెండు నెలలుగా ప్రాక్టీస్‌కు దూరమైన భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తమ నివాస స్థలంలోనే సాధనను కొనసాగిస్తున్నట్లు చెప్పాడు. తను ఉంటున్న అపార్ట్మెంట్లో తండ్రి సాయంతో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానన్నాడు. ‘మా ఫ్లాట్‌లో ఖాళీగా ఉన్న స్థలాన్ని సన్నాహకానికి ఉపయోగించుకుంటున్నా. సాఫ్ట్ బాల్‌తో క్యాచ్‌లు పడుతున్నా. బంతిని గోడకేసి కొట్టి... క్యాచ్‌లుగా పట్టేందుకు శ్రమిస్తున్నా. దీనికి మా నాన్న ప్రశాంత సాహా సాయమందిస్తున్నారు. నేను చేసే ప్రాక్టీస్‌కు ఈ స్థలం, మా నాన్న సాయం సరిపోతుంది. అటు ఇటు కీపింగ్ క్యాచింగ్ చేస్తున్నాను. లాక్‌డౌన్‌తో బయటికి వెళ్లకుండానే కీపింగ్ డ్రిల్స్ చేస్తున్నాను. రన్నింగ్‌కు వీల్లేకపోయినా అపార్ట్మెంట్ లోపలే వాకింగ్‌తో సరిపెట్టుకున్నాను. పూర్తిస్థాయి జిమ్ లేదు కానీ అందుబాటులోని ఎక్సర్సైజ్ సామాగ్రితో రోజు కసరత్తు చేస్తున్నా’ అని సాహా చెప్పాడు. -
‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’
బెంగళూరు: మానసిక ఆందోళనతో తాను తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నానని భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నాడు. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినట్లు అతను చెప్పాడు. ఉతప్ప టీమిండియా తరఫున 46 వన్డేలు, 13 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2008లో జట్టులో చోటు కోల్పోయిన సమయంలో తీవ్ర ఒత్తిడి కారణంగా పలు రకాల ఆలోచనలతో తాను సతమతమయ్యేవాడినని ఉతప్ప గుర్తు చేసుకున్నాడు. ‘2009–2011 మధ్య కాలంలో నేను దాదాపు ప్రతీ రోజూ తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాను. భారత జట్టులో స్థానం లభించకపోవడం కూడా ఒక కారణం కావచ్చు కానీ క్రికెట్ మాత్రమే కాకుండా ఇతరత్రా కూడా నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. ముఖ్యంగా క్రికెట్ జరగని రోజుల్లో నా పరిస్థితి దారుణంగా ఉండేది. అసలు ఈ రోజు గడుస్తుందా, రేపటి వరకు ఉండగలనా అనిపించేది. అలా పరుగెత్తుకుంటూ వెళ్లి బాల్కనీలోంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనే భావన కూడా వచ్చింది. కానీ ఏదోలా అది ఆగిపోయింది.’ అని ఉతప్ప తన అనుభవాన్ని వెల్లడించాడు. -
పరుగుతో విశ్వాసం
దేశం కోసం చేసే ప్రతి పరుగు తనలో ఆత్మవిశ్వాసం నింపుతుందన్నాడు భారత్ క్రికెటర్ అజింక్యా రహానే. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్‌లో నాలుగు వందల మంది టాప్ ఫినిషర్స్‌కు ప్రత్యేకంగా తయారు చేసిన టీ షర్ట్స్ ‘ఫినిషర్ టీ’ను నైకి అందించింది. జూబ్లీహిల్స్‌లోని నైకి రన్నింగ్ డెస్టినేషన్ స్టోర్‌లో భారత క్రికెటర్ అజింక్యా రహానే చేతుల మీదుగా మంగళవారం సాయంత్రం ఈ టీ షర్ట్‌లను రన్నర్లు అందుకున్నారు. ఈ సందర్భంగా అజింక్యా రహానే ‘సిటీప్లస్’తో ముచ్చటించాడు. మారథాన్‌లో సిటీవాసులు సత్తాచాటారని హైదరాబాదీలను పొగడ్తలతో ముంచెత్తాడు. క్రికెట్లో బ్యాటింగ్ ఎంత ముఖ్యమో రన్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నాడు. ‘నేను పొందే శిక్షణలో రన్నింగ్ ఎంతో కీలకం. అది నన్ను చురుగ్గా ఉంచుతుంది. హైదరాబాద్ మారథాన్‌లో ప్రతి రన్నర్ పడిన శ్రమకు, అంకితభావానికి హ్యాట్సాఫ్’ అని ప్రశంసించాడు. హైదరాబాద్ స్వీట్ సిటీ అన్న ఈ ఆటగాడు ఇక్కడి రుచులు మాత్రం స్పైసీతో టేస్టీగా ఉంటాయంటున్నాడు. ధోనీ, కోహ్లీ బెస్ట్ రన్నర్స్.. భారత క్రికెట్ జట్టులో వికెట్ల మధ్య ఫాస్ట్‌గా పరుగెత్తడంలో కెప్టెన్ ధోనీ, విరాట్ కోహ్లీ ముందుంటారన్నాడు. సచిన్, ద్రవిడ్ తన అభిమాన క్రికెటర్లని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో వన్డే సిరీస్‌లో సెంచరీ చేయడం ఎంతో ఆనందానిచ్చిందన్నాడు. గంట గంటకూ మారిపోయే ఇంగ్లండ్ వాతావరణానికి తగ్గట్టు మన ఆటను మార్చుకోవాల్సి ఉంటుదని తెలిపాడు. తనను ద్రవిడ్‌తో పోల్చడం సరికాదన్న ఈ యువ ఆటగాడు.. ఇప్పుడిప్పుడే ఆటను మెరుగుపరుచుకుంటూ నిలదొక్కుకుంటున్నానని చెప్పాడు. సీనియర్ల మార్గనిర్దేశంలో యువ ఆటగాళ్లు రాటుదేలుతున్నారన్న రహానే డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం బాగుంటుందన్నాడు.