మరొకరితో భారత క్రికెటర్‌ భార్య.. లిప్‌లాక్‌ వీడియో వైరల్‌ | Hardik Pandya's Wife Natasa Stankovic Posted A Lip Lock Kissing Video - Sakshi
Sakshi News home page

Hardik Pandya Wife: మరొకరితో భారత క్రికెటర్‌ భార్య.. లిప్‌లాక్‌ వీడియో వైరల్‌

Sep 8 2023 12:53 PM | Updated on Sep 8 2023 1:35 PM

Hardik Pandya Wife Posted Kissing Video - Sakshi

భారత క్రికెటర్‌ హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ షేర్‌ చేసిన ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆమె సెర్బియా దేశస్థురాలు అయినా భారత్‌లోనే ఉంటుంది. ఆమె ఒక డ్యాన్సర్‌,మోడల్‌,నటి.  ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహతో బాలీవుడ్ చిత్రాలలో అడుగుపెట్టారు. అలా 2020 వరకు సుమారు 20కి పైగా చిత్రాల్లో నటించారు. బాలీవుడ్‌లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ 8లో కూడా ఆమె పాల్గొన్నారు.

(ఇదీ చదవండి: నటి మహాలక్ష్మి భర్త రవీందర్‌ అరెస్ట్‌)

నటాషా ఒక నటి కాబట్టి.. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా హాట్, బోల్డ్ చిత్రాలను ఆమె షేర్‌ చేస్తూ ఉంటారు. వాటిని అభిమానులు కూడా చాలా ఇష్టపడతారు.  ఈ సమయంలో నటాషా అనేక ఫోటోలతో పాటు ఒక వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. అందులో ఆమె మరోక వ్యక్తిని ముద్దులు పెట్టుకున్న సన్నివేశం ఉండటంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆ వీడియోలో చుట్టూ చీకటిగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏదో ఒక పార్టీలో నటాషాతో పాటు మరోక వ్యక్తి ఉన్నారు. వారిద్దరూ కూడా చాలా చనువుగా ఉండటమే కాకుండా లిప్‌లాక్‌ కిస్‌ కూడా పెట్టుకున్నారు. ఈ వీడియోను కూడా నటాషానే షేర్‌ చేస్తూ.. ఇవన్నీ 'గుర్తుంచుకోవలసిన జ్ఞాపకాలు' అని క్యాప్షన్ ఇచ్చారు.

(ఇదీ చదవండి: 'బేబి'లో వైష్ణవి పెళ్లి చేసుకున్న నటుడితడే! అమ్మాయి చేతిలో మోసపోయానంటూ..)

అయితే  ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. కానీ ఆ వీడియోకు  హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ హార్దిక్ పాండ్యా స్వయంగా వ్యాఖ్యానించడం విశేషం. కానీ నెటిజన్లు మాత్రం ఆమెను తప్పుబడుతున్నారు. మీరు మరొక వ్యక్తిని ఎందకు ముద్దు పెట్టుకున్నారని నటాషాను ప్రశ్నిస్తున్నారు. మీరు చాలా హాట్‌ అంటూ మరోకరు తెలిపారు. కానీ నటాషా తిరిగి ఎవరికీ రిప్లై ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవతుంది. ఏదేమైనా టీమిండియా క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా- నటాషా జోడీ అద్భుతంగా ఉంటుంది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement