తెరపైకి ఆర్జీవీ జీవితం | RGV Biopic Movie Will Be In Three Parts | Sakshi
Sakshi News home page

తెరపైకి ఆర్జీవీ జీవితం

Aug 26 2020 2:40 AM | Updated on Aug 26 2020 2:40 AM

RGV Biopic Movie Will Be In Three Parts - Sakshi

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నిజ జీవితం తెరపైకి రానుంది. అది కూడా ఒక్క సినిమా కాదు.. మూడు సినిమాలు కావడం విశేషం. రామ్‌గోపాల్‌ వర్మ ఆధ్వర్యంలో దొరసాయి తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బొమ్మాకు క్రియేషన్స్‌ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మించనున్నారు. ఇందులో మొదటి సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా బొమ్మాకు మురళి మాట్లాడుతూ– ‘‘రామ్‌గోపాల్‌ వర్మ నిజ జీవితాన్ని 3 భాగాలుగా నిర్మించనున్నాం. ఒక్కొక్క భాగం 2 గంటలుంటుంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తాం. మొదటి భాగంలో 20 ఏళ్ల ఆర్జీవీ పాత్రలో ఒక కొత్త నటుడు నటించబోతున్నారు. రెండో భాగంలో వేరే నటుడు నటిస్తారు. ఇక మూడో భాగంలో ఆర్జీవీ పాత్రలో స్వయంగా ఆర్జీవీయే  నటించబోతుండటం విశేషం’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement