‘‘యాసిడ్ అమ్మడం ఆపేస్తే ఎంత బాగుంటుంది. ఈ దాడులు ఉండవు, నా ముక్కు, నా చెవులు సరిగా లేవు..ఈ జుమ్కీని నేను ఎక్కడ అలంకరించుకోవాలి, అతను నా ముఖాన్ని నాశనం చేశాడు.. నా ఆత్మవిశ్వాసాన్ని కాదు’’...మంగళవారం విడుదలైన హిందీ చిత్రం ‘చప్పాక్’ ట్రైలర్‌లోని డైలాగ్స్ ఇవి. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ‘రాజీ’ ఫేమ్ మేఘన్ గుల్జర్ ఈ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపికా పదుకోన్ నటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment