Laxmi agarwal
-
ఛపాక్ ఎఫెక్ట్: యాసిడ్ బాధితులకు పెన్షన్!
విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ‘ఛపాక్’ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఛపాక్ ఇప్పుడు అసలు సిసలైన విజయాన్ని ముద్దాడబోతోంది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ‘ఛపాక్’. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే అద్భుత నటనను ప్రదర్శించింది. జనవరి 10న విడుదలైన ఈ సినిమా సగటు ప్రేక్షకునితోపాటు ఓ ప్రభుత్వాన్ని సైతం కదిలించింది. యాసిడ్ బాధితుల కోసం పెన్షన్ అందిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించడమే దీనికి నిదర్శనం. ఈ మేరకు ఆ రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య మాట్లాడుతూ.. యాసిడ్ బాధితులు సగౌరవంగా బతికేందుకు వారికి ప్రతినెల రూ.5000 నుంచి రూ.6000 అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్లో ప్రతిపాదన తీసుకొస్తామని, అది ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక సహాయం ద్వారా ధీర వనితలు వారి ఆశయాలను సాధించడంలో దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఈ సినిమాకు వినోదపు పన్నును మినహాయించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఛపాక్ మూవీ రివ్యూ) -
ఆ మార్పు మీరే అవ్వండి!
చుట్టూ బాడీగార్డులు లేకుండా ఒంటరిగా దీపికా పదుకోన్ బయటికొస్తే ఏమవుతుంది? జనాలు చుట్టుముట్టేస్తారు. అభిమాన తారను చూసిన ఆనందంలో క్రేజీ ఫ్యాన్స్ అయితే హద్దులు దాటే అవకాశం కూడా ఉంది. అలాంటి దీపికా పదుకోన్ ముంబైలో ఏకంగా సూపర్ మార్కెట్‌కి, బట్టల దుకాణానికి, ఓ మొబైల్ షాప్‌కి, ఇతర రద్దీ ప్రాంతాలకు వెళితే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెను పట్టించుకోలేదు. ఎందుకంటే ఇలా వీధుల్లో తిరిగినది అందాల దీపికా కాదు. మాలతి (‘ఛపాక్’లో దీపికా పాత్ర పేరు) రూపంలో తిరిగిన దీపికా. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందిన ‘ఛపాక్’లో లక్ష్మీ పాత్రను దీపికా పదుకోన్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దీపికా ఓ నిర్మాత కూడా. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యాసిడ్ దాడి బాధితులను సమాజం ఎలా చూస్తోంది? అనే విషయాన్ని తెలుసుకోవడానికి దీపికా సినిమాలో తాను చేసిన మాలతి గెటప్‌లో రద్దీ ప్రాంతాలకు వెళ్లారు. ఆమెతో పాటు కొందరు యాసిడ్ దాడి బాధితులు కూడా వెళ్లారు. దీపికాను ఎవరూ గుర్తుపట్టలేదు. అందవిహీనంగా ఉన్న వీళ్లను చూసి కొందరు ముఖాలు చిట్లించుకున్నారు. చిరాకు పడ్డారు కూడా. కొందరు మాత్రం మామూలుగానే మాట్లాడారు. ఇదంతా రహస్య కెమెరాల్లో షూట్ చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసి, ‘‘ఏ మార్పుని అయితే చూడాలనుకుంటున్నారో ముందు ఆ మార్పు మీరే అవ్వండి’’ అని దీపికా పదుకోన్ పేర్కొన్నారు. -
‘మాల్తీ’గా ముంబైలో దీపిక చక్కర్లు
-
ఆ చూపులు మారాలి: హీరోయిన్
ముంబై: సాటి మనుషులను చూసే విధానం మారాలి అంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఛపాక్. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో దీపిక మాల్తీగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఛపాక్‌తో తొలిసారిగా నిర్మాత అవతారమెత్తిన దీపిక... రియాలిటీ షోలకు హాజరవుతూ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఛపాక్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా యాసిడ్ దాడి బాధితులతో కలిసి ’ఛపాక్’సోషల్ ఎక్స్పెరిమెంట్ పేరిట దీపిక ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. మాల్తీ మాదిరి మేకప్ చేసుకుని... యాసిడ్ దాడి బాధితుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరును కళ్లారా చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన దీపిక.. ‘ ఇలా ఓ రోజంతా గడిపిన తర్వాత.. కొన్ని నిజాలు మన ముందే ఉన్నా.. మనం వాటిని గుర్తించలేము. ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. చూసే చూపుల్లో మార్పు రావాలి అని పేర్కొన్నారు. ఇక దీపిక షేర్ చేసిన వీడియోలో.. కొంతమంది యాసిడ్ బాధితులను ప్రేమ పూర్వకంగా పలకరించగా.. మరికొంత మంది మాత్రం వారిని వికారంగా చూసి చూపులు తిప్పుకోవడం గమనార్హం. -
దుమ్మురేపుతున్న హీరోయిన్ వీడియోలు!
-
దుమ్మురేపుతున్న హీరోయిన్ వీడియోలు!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘టిక్‌టాక్’ వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ యాప్‌తో ఎంతో మంది యువతి, యువకులు సెలబ్రిటీలుగా కూడా మారిపోయారు. దీంతో చిన్నపిల్లలు, మహిళల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఈయాప్‌లో మునిగితేలుతున్నారు. అయితే సెలబ్రిటీలు కూడా సరదాగా ‘టిక్‌టాక్’లో జోక్స్, డైలాగ్స్, డ్యాన్స్ వీడియోలు చేసి అభిమానుల కోసం షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా చేరారు. దీపిక తన సన్నిహితులతో కలిసి పాటలకు చిందులేస్తూ.. డైలాగ్స్ చెబుతున్న వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఒకేసారి దీపిక తన టిక్‌టాక్ ఎకౌంట్లో 1.2 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించారు. ఇప్పటికీ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌తో కూడా కలిసి చేసిన వీడియోను కూడా షేర్ చేశారు దీపికా. ఇందులో దీపిక ర్యాప్ సాంగ్ వీడియోతో పాటు తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించిన ‘బాజీరావులో’ని ‘లట్ పట్ లట్ పట్’ మరాఠి పాటకు చిందులేస్తూ.. మొత్తంగా ఆరు వీడియోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. కాగా 2005లో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ‘చపాక్’ చిత్రాన్ని దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో మాల్తీ పాత్రలో దీపిక లీడ్ రోల్ చేస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. -
లక్ష్మీని ఓదార్చిన దీపిక!
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా... బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఛపాక్’. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ముంబైలో ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీపికతో పాటు లక్ష్మీ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఈ చిత్రంలోని పాట పాడుతుండగా స్టేజీపై ఉన్న లక్ష్మీ భావోద్యేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. దీంతో పక్కనే ఉన్న దీపిక ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చారు. అలాగే ఈ కార్యక్రమంలో దీపిక కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, 2005లో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ‘ఛపాక్’ చిత్రాన్ని దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో మాల్తీ పాత్రలో దీపిక లీడ్ రోల్ చేస్తున్నారు. తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘ఇది కేవలం లక్ష్మీ బయోపిక్ మాత్రమే కాదు. ఆమె ప్రయాణం, పోరాటం, విజయం, మానవ ఆత్మకథ’ అంటూ చెప్పుకొచ్చారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘ఛపాక్’ సినిమాను ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు దీపిక నిర్మాతగా కూడా వ్యవహరించారు. View this post on Instagram #LaxmiAgarwal & #DeepikaPadukone get emotional as #shankarmahadevan sings the title track of #Chhapaak #ManavManglani #friday A post shared by Manav Manglani (@manav.manglani) on Jan 2, 2020 at 11:23pm PST -
‘ఛపక్’.. ధైర్య ప్రదాతలు
‘యాసిడ్ పడింది మా ముఖం మీద మాత్రమే, మా మనో ధైర్యం అలాగే ఉంది’.. యాసిడ్ బాధితులు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాట ఇది. యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ జీవితం ‘ఛపక్’ పేరుతో సినిమాగా వస్తోంది. చిన్నతనంలో భయంకరమైన యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ పెద్దయిన తర్వాత ప్రభుత్వం యాసిడ్ అమ్మకాల మీద నియంత్రణ విధించే వరకు పోరాటాన్ని కొనసాగించారు. ఆ పాత్రనే ఛపక్లో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. సినిమా జనవరి 10న విడుదల అవుతోంది. ఇప్పటికే ట్రెయిలర్ రిలీజ్ అయ్యి ప్రశంసలను అందుకుంటోంది. లక్ష్మిలా.. భస్మం నుంచి ఫీనిక్స్‌లా లేచిన ధీరలెందరో. వాళ్లు నేటి సమాజంలో పోరాడుతూ ఉన్నారు, సమాజంతో పోరాడుతూ ఉన్నారు. వారిలో ముగ్గురు... ప్రగ్యాసింగ్, దౌలత్ బీ ఖాన్, అన్మోల్ రోడ్రిగ్స్. ఈ ముగ్గురి గురించి క్లుప్తంగా. పెళ్లొద్దన్నందుకు ప్రగ్యా సింగ్ ప్రగ్యా సింగ్ 2006లో వారణాసి నుంచి ఢిల్లీ వస్తోంది. అప్పటికి ఆమెకు 23 ఏళ్లు, పెళ్లయి పన్నెండు రోజులైంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో, ఆమె రైల్లో గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఆమె ముఖం మీద యాసిడ్ చిమ్మింది. దాడి చేసిన వ్యక్తి గతంలో ఆమెను పెళ్లాడాలని అడిగి ఆమె నిరాకరించడంతో కోపం పెట్టుకున్నవాడు. అతడి ప్రకోపానికి గురయింది ప్రగ్యాసింగ్. ప్రాణాపాయం నుంచి కోలుకున్న తర్వాత ఆమె మామూలు కావడానికి పదిహేనుకు పైగా సర్జరీలయ్యాయి. ఇప్పుడామె.. భర్త, స్నేహితుల సహకారంతో ‘అతిజీవన్ ఫౌండేషన్’ అనే ఎన్జీవోను స్థాపించి, యాసిడ్ బాధితులకు ధైర్యాన్నిస్తోంది. ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తోంది. వాళ్లు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. ఇద్దరు బిడ్డలతో సంతోషంగా జీవిస్తున్న తన జీవితాన్నే ఆదర్శంగా తీసుకోవలసిందిగా ఆమె బాధితుల్లో స్ఫూర్తిని పెంచుతోంది. గృహ హింస దౌలత్ దౌలత్ బీ ఖాన్‌ది ముంబయి. ఇరవై ఆరేళ్ల వయసులో తన పెద్దక్క, బావల నుంచే గృహహింసలో భాగంగా యాసిడ్ దాడికి గురైందామె! ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ 2016లో ‘సాహాస్ ఫౌండేషన్’ స్థాపించి యాసిడ్ దాడికి గురైన బాధితులకు భరోసాగా నిలుస్తోంది. వైద్య సహాయంతోపాటు వారికి న్యాయపరమైన సహాయం కూడా అందిస్తోంది. బాధితులు సౌకర్యంగా పని చేసుకోగలిగిన ఉద్యోగాలను గాలిస్తూ వారిని ఆ ఉద్యోగాల్లో చేరుస్తోంది దౌలత్. పాపాయిగా ఉన్నప్పుడే! అన్మోల్ అన్మోల్ పరిస్థితి మరీ ఘోరం. రెండు నెలల పాపాయిగా ఉన్నప్పుడు యాసిడ్ దాడికి గురైంది. ఆడపిల్ల పుట్టిందని భార్యాబిడ్డలను హతమార్చాలనుకున్నాడు ఆమె తండ్రి. బిడ్డకు పాలిస్తున్న భార్య మీద, పాలు తాగుతున్న బిడ్డ మీద యాసిడ్ కుమ్మరించాడు. అన్మోల్ తల్లి ప్రాణాలు కోల్పోయింది, అన్మోల్ బతకడం కూడా ఒక అద్భుతమనే చెప్పాలి. ఆమె బాల్యమంతా హాస్పిటల్ బెడ్, ఆపరేషన్ థియేటర్లలో గడిచిపోయింది. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత అనాథ శరణాలయం ఆమె అడ్రస్ అయింది. బాల్యంలో తోటి పిల్లల ప్రశ్నార్థకపు చూపులను తట్టుకుని గట్టి పడిపోయిందామె. అదే ధైర్యంతో స్కూలు, కాలేజ్ చదువు పూర్తి చేసి ఫ్యాషన్‌రంగాన్ని కెరీర్‌గా మలుచుకుంది. ఇప్పుడామె సక్సెస్ఫుల్ మోడల్. తాను మోడలింగ్ చేస్తూ, మరో పక్క ఇరవై మంది యాసిడ్ సర్వైవర్స్‌కి సహాయం చేసింది. వారికి బతుకు మీద ధైర్యాన్ని కల్పించడం, బతుకుకు ఒక మార్గాన్ని చూపించడం అన్మోల్ చేస్తున్న సహాయం. నిజమే... యాసిడ్ పడింది వాళ్ల ముఖం మీద మాత్రమే. వాళ్ల మనోధైర్యం మీద కాదు. – మంజీర -
ముఖాన్ని నాశనం చేశాడు... నా ఆత్మవిశ్వాసాన్ని కాదు
‘‘యాసిడ్ అమ్మడం ఆపేస్తే ఎంత బాగుంటుంది. ఈ దాడులు ఉండవు, నా ముక్కు, నా చెవులు సరిగా లేవు..ఈ జుమ్కీని నేను ఎక్కడ అలంకరించుకోవాలి, అతను నా ముఖాన్ని నాశనం చేశాడు.. నా ఆత్మవిశ్వాసాన్ని కాదు’’...మంగళవారం విడుదలైన హిందీ చిత్రం ‘చప్పాక్’ ట్రైలర్‌లోని డైలాగ్స్ ఇవి. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ‘రాజీ’ ఫేమ్ మేఘన్ గుల్జర్ ఈ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపికా పదుకోన్ నటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేయాలనుకుంటున్నారు. -
రేపే ట్రైలర్ విడుదల: దీపికా
ముంబై: బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న తాజా చిత్రం ఛపాక్. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా దీపిక స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా దీపికా ఈ సినిమాకి సంబంధించిన ఆరు సెకన్ల టీజర్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి ‘ ఛపాక్ చిత్రం ట్రైలర్ రేపు( మంగళవారం) విడుదలవుతుంది. తప్పక చూడండి’ అంటూ ఆమె కామెంట్ చేశారు. వెరైటీగా ఉన్న ఈ టీజర్లో ‘రేపు ట్రైలర్ విడుదల’ అని కనిపిస్తుంది. ఇలా కథకు దగ్గరగా కొత్తగా ఉన్న టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ టీజర్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో దీపికా లుక్కు సంబంధించి పలు ఫోటోలను ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. చిత్ర దర్శకురాలు మేఘనా గుల్జార్ ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. దీపికా ఇప్పటి వరకు నటించిన సినిమాలకు పూర్తి భిన్నమైన నటన ఉంటుందని తెలిపారు. తన నటనతో ఈ సినిమా మరో స్థాయికి చేరుతుందని పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో దీపికా నవ్వే విధానం కూడా అచ్చం లక్ష్మీ అగర్వాల్లా ఉందని.. అంత బాగా దీపికా నటించిందని దర్శకురాలు మేఘనా గుల్జార్ పేర్కొన్నారు. A moment is all it took... Trailer out tomorrow.Keep watching this space...#Chhapaak@meghnagulzar @masseysahib @_KaProductions @foxstarhindi @MrigaFilms pic.twitter.com/OepDzgm1ic — Deepika Padukone (@deepikapadukone) December 9, 2019 -
రియల్ బ్యూటీ ఎంత గ్రేస్‌గా స్టెప్పులేశారో!
ఎంత పెద్ద కష్టం దాటితే అంత పెద్ద హీరోలవుతారు.. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు.. లక్ష్మీ అగర్వాల్ కూడా ఆ కోవకు చెందిన వారే. పద్నాలుగేళ్ల క్రితం యాసిడ్ దాడి రూపంలో ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూశాడో ఉన్మాది. అయితే.. పాపం ఆ మూర్ఖుడికి తెలియదు అతడి పాశవిక చర్య కేవలం లక్ష్మీ శరీరాన్ని మాత్రమే బాధించగలదని. యాసిడ్ దాడిలో ముఖం మెడ భాగం పూర్తిగా కాలిపోయినా.. మనోనిబ్బరంతో లక్ష్మీ తనకొచ్చిన ఆపద నుంచి బయటపడ్డారు. తనలాంటి బాధితులకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకుంటున్నారు. అందుకే బాలీవుడ్ స్టార్ భామ దీపికా పదుకొణె... లక్ష్మీ బయోపిక్ ‘చప్పాక్’ లో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మీ అగర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ మూవీ ‘భాగీ’ సినిమాలోని చమ్ చమ్ సాంగ్‌కు స్టెప్పులేసిన లక్ష్మీ.. ఆ వీడియోను ‘టిక్‌టాక్’లో అప్లోడ్ చేశారు. దీంతో ఫిదా అయిన నెటిజన్లు.. ‘రియల్ బ్యూటీ ఎంత గ్రేస్‌గా స్టెప్పులేశారో’ అంటూ ‘చప్పాక్ హీరో’ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా 2005లో ఓ 32 ఏళ్ల వ్యక్తి తనని పెళ్లి చేసుకోవాలంటూ లక్ష్మిని వేధించాడు. కానీ ఆమె అందుకు నిరాకరించడంతో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అనేక సర్జరీల అనంతరం కోలుకున్న లక్ష్మీ.. యాసిడ్ దాడి బాధితుల తరఫున పోరాడుతున్నారు. యాసిడ్ అమ్మకాలపై నిషేధం విధించడంతో తన వంతు పాత్ర పోషించారు. -
ఎప్పటికీ ఉండి పోతుంది!
ఒకరిలా ఇంకొకరు కనిపించడం అసాధ్యం. మేకప్‌తో కొంతవరకూ మేనేజ్ చేయొచ్చు. కానీ పూర్తిగా చేయగలిగితే మాత్రం అద్భుతం అనే అనాలి. ఇప్పుడు దీపికా పదుకోన్‌ని అందరూ అలానే అంటున్నారు. ఎందుకంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయారామె. ఆ మార్పుని చూడగానే ‘ఈవిడ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ కదా’ అని అనుకోకుండా ఉండరు. అంతలా దీపిక తన లుక్‌ని మార్చుకున్నారు. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా దీపిక చేస్తున్న చిత్రం ‘ఛపాక్’. ఈ చిత్రంలో దీపిక లుక్‌ని సోమవారం విడుదల చేశారు. ఇప్పటివరకూ దీపిక చేసిన సినిమాలు ఓ ఎత్తు ఈ సినిమా మరో ఎత్తు. ఇందులో డీ–గ్లామరైజ్డ్ రోల్లో కనిపిస్తారు. లక్ష్మీ జీవితానికి దీపిక ఎంతగా ఇన్స్పైర్ అయ్యారంటే.. కేవలం ఆమె పాత్రను పోషించడమే కాదు.. ఈ చిత్రానికి ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. జీవితంలో వచ్చిన పెద్ద కుదుపు నుంచి ధైర్యంగా తేరుకున్న లక్ష్మీ పాత్రలో ఒదిగిపోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు దీపిక. ఆమెలా మారడానికి గంటలు గంటలు మేకప్‌కి కేటాయించాల్సిందే. దీపికను ఎక్కువ కష్టపెట్టే పాత్ర. అయినా ఆనందంగా చేస్తున్నారు. ‘‘ఈ పాత్ర నాతో ఎప్పటికీ ఉండిపోతుంది. ఈ రోజు నుంచి షూటింగ్ మొదలుపెట్టాం’’ అన్నారు దీపిక. ‘రాజీ’ మూవీ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో దీపిక పాత్ర పేరు మాల్తీ. వచ్చే ఏడాది జనవరి 10న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
‘ఛపాక్’ ఫస్ట్ లుక్.. ఊహించని రీతిలో దీపిక
యాసిడ్ దాడి. అది ఆమె శరీరాన్ని ఎంతగా బాధించిందో, అంతకంటే ఎక్కువగా మనసును వేధించింది. అయినా ఆమె పెదాలపై చిరునవ్వు చెదరలేదు. బహుశా ఆ చిరునవ్వే గాయాలకు మందేమో..! బాధలు కన్పించకుండా దిగమింగుతుందేమో..! తన గెలుపుకు చిహ్నమేమో..! ఇలా ఎన్నో ఆలోచనల్ని రేకెత్తిస్తున్న ఆ నవ్వు మరెవరిదో కాదు బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనెది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ నిజ జీవితకథతో ‘ఛపాక్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మాలతి పాత్రలో దీపికా పదుకొనె నటిస్తుంది. నాకు జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర ‘మాలతీ’ అంటూ దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో రివీల్ చేసిన ఫస్ట్ లుక్కు గంటలోపే 5 లక్షలకుపైగా లైకులు వచ్చాయి. శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నావంటూ దీపికపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడే అంచనాల్ని పెంచేస్తున్న ‘ఛపాక్’ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుందని తెలిపింది. ఒక ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ.. ‘పద్మావత్’ చిత్రం తర్వాత అలాంటి చిత్రాలు చేయడానికి మానసికంగా సిద్ధంగా లేను. ఏదైనా లవ్‌స్టోరీ చేయాలనుకున్నా. కానీ ఎప్పుడైతే మేఘనా గుల్జార్ ‘ఛపాక్’ స్క్రిప్ట్ వినిపించిందో అప్పుడే నా నిర్ణయాన్ని మార్చుకున్నా. కథ విన్న ఐదు నిమిషాల్లోనే సినిమా ఒప్పుకోవడమే కాకుండా, ఆ చిత్రానికి ప్రొడ్యూసర్‌గా మారాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. ఇక ఈ చిత్రం విషయానికొస్తే యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ తన జీవితంలో సాగించిన పోరాటమే ఈ కథా సారాంశం. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు విక్రాంత్ మాస్సే కీలక పాత్రలో నటించనున్నాడు. మొదట ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం ఈ రోజే పట్టాలెక్కనుంది. -
గాయం.. విజయ గేయం
ఏడాది అయిపోయింది దీపికా పదుకోన్ మేకప్ వేసుకుని సిల్వర్‌స్క్రీన్ మీద కనిపించి. తన నెక్ట్స్ సినిమా ఏంటో అఫీషియల్‌గా అనౌన్స్ చేశారామె. యాసిడ్ అటాక్ బాధితురాలిగా దీపిక ఓ సినిమాలో నటించబోతున్నారన్న సంగతి తెలిసిందే. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ అటాక్ బాధితురాలి పాత్రలో కనిపించనున్నానని దీపిక అధికారికంగా పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలసి ఆమె నిర్మిస్తుండటం విశేషం. ‘మిర్జాపూర్’ వెబ్‌సిరీస్‌తో మంచి పేరు సంపాదించుకున్న విక్రాంత్ మాస్సే ఇందులో దీపికా సరసన యాక్ట్ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రానికి ‘చప్పాక్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘‘గాయం.. అద్వితీయమైన పోరాట పటిమ.. విజయ గేయం.. గాయం, విజయం చుట్టూ సాగే కథ ఇది. ఫాక్స్ స్టార్ స్టూడియోతో కలసి పని చేయడం ఆనందంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు దీపికా పదుకోన్. -
యాసిడ్ బాధితురాలిగా...
దాదాపు పదమూడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో యువతి లక్ష్మీ అగర్వాల్‌పై జరిగిన యాసిడ్ దాడి విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ దాడి నుంచి కోలుకున్న తర్వాత లక్ష్మీ అగర్వాల్ జీవితంలో ముందడుగు వేశారు. ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆమె జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ సినిమా రూపొందనుంది. ‘తల్వార్, రాజీ’ చిత్రాల ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘‘లక్ష్మీ అగర్వాల్ కేసులో సోషియో–మెడికల్ అండ్ లీగల్ ఇంపాక్ట్ కనిపిస్తోంది. అందుకే ఈ సినిమాలో యాసిడ్ బాధితుల గురించి లార్జ్ స్కేల్లో చూపించాలనుకుంటున్నాం. యాసిడ్ అమ్మకాన్ని దేశంలో బ్యాన్ చేశారు. కానీ ఇప్పటికీ టైర్–3 పట్టణ ప్రాంతాల్లో యాసిడ్‌ను కిరాణా స్టోర్స్‌లో అమ్ముతున్నారు’’ అని పేర్కొన్నారు మేఘనా. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ చిత్రంతో నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు దీపికా పదుకోన్. -
వెండి తెరపైకి లక్ష్మి అగర్వాల్ జీవితం
లక్ష్మి అగర్వాల్.. ఈ పేరు వినే ఉంటారు. ప్రేమను తిరస్కరించినందుకు ఓ దుర్మార్గుడు జరిపిన యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడి, ఎన్నో ఆపరేషన్ల తర్వాత మామూలు స్థాయికి వచ్చిన అమ్మాయి లక్ష్మి అగర్వాల్. తనకు జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకుండా ఉండేందుకు, యాసిడ్ దాడి బాధితురాలకు అండగా నిలిచేందుకు ఉద్యమిస్తోంది లక్ష్మి అగర్వాల్. తాజాగా ఈమె బయోపిక్ వెండి తెరపైకి రాబోతుంది. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్, లక్ష్మి అగర్వాల్ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారు. ఈ బయోపిక్‌లో లక్ష్మి అగర్వాల్‌గా, యాసిడ్ దాడి బాధితురాలిగా దీపికా పదుకొనే నటించబోతున్నారట. ‘పద్మావత్’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దీపికా పదుకొనే ఈ చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలిసింది. దీపికా ఈ చిత్రంలో యాసిడ్ దాడి బాధితురాలిగా నటించడమే కాకుండా.. ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. దీపికా కూడా ఈ ప్రాజెక్ట్‌ను ధృవీకరించింది. ‘ఈ స్టోరీ విన్నప్పుడు, ఇది కేవలం హింస మాత్రమే కాదు. బలం, ధైర్యం, ఆశ, విజయం అని లోతుగా విశ్లేషిస్తే అర్థమైంది. వ్యక్తిగతంగా, సృజనాత్మకంగా ఈ ప్రాజెక్ట్ నాపై చాలా ప్రభావం చూపుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా ఏదో చేయాలనిపించి, నిర్మాతగా కూడా మారాను’ అని దీపికా అన్నారు. ఈ సినిమాతో లక్ష్మి అగర్వాల్ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, యాసిడ్ దాడి తర్వాత ఆమె జీవితం ఎలా మారింది. ఏ మాత్రం అధైర్యపడకుండా.. యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా ఆమె ఉద్యమిస్తున్న తీరు.. అన్నీ వెండితెరపై మెరవనున్నాయి. ప్రేమను తిరస్కరించినందుకు 15 ఏళ్ల వయసులోనే యాసిడ్ దాడికి గురై, చిత్రవధకు గురయ్యారు లక్ష్మి అగర్వాల్. గత కొన్నేళ్లుగా ఆమె యాసిడ్ దాడులు ఆపాలంటూ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 2014లో మెచెల్లీ ఒబామా చేతుల మీదుగా యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు సైతం అందుకున్నారు. అప్పటి నుంచి పలు టీవీ షోల్లో కూడా పాల్గొంటున్నారు. 2016 లండన్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసి ప్రపంచమంతా ఆమె ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకునేలా చేసుకున్నారు. ప్రస్తుతం బిగ్ స్క్రీన్‌పైకి వస్తున్న లక్ష్మి అగర్వాల్‌లో దీపికా కనిపించబోతుండటంతో, చిత్ర పరిశ్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
ఆమె స్ఫూర్తికి ‘స్టాండింగ్ ఒవేషన్’!
స్వచ్ఛమైన మనసే అసలైన అందం అన్న లక్ష్మీ అగర్వాల్ సాక్షి, అమరావతి బ్యూరో: ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. యాసిడ్ దాడులను అడ్డుకోవాలని, బాధితులను ఆదుకోవాలని ఉద్యమించిన సామాజిక కార్యకర్త ఈమె. ఆమె మాటలు అందరిలో స్ఫూర్తినింపుతూ బాధ్యతను గుర్తు చేశాయి. అందుకే సదస్సుకు హాజరైన వారంతా ఆమె ప్రసంగం ముగియగానే లేచి నిల్చొని అభినందించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ ‘అసలు అందమంటే ఏమిటి’అని ఆమె సూటిగా ప్రశ్నించారు. బాహ్య సౌందర్యం అందం కాదని గుర్తించాలని స్పష్టం చేశారు. అందమంటే ఏమిటో కచ్చితంగా పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సమాజంలో మహిళలపై వివక్ష, దాడులను అడ్డుకోగలమని తేల్చి చెప్పారు. యువతులను అందవిహీనంగా చేసి పైశాచిక ఆనందాన్ని పొందేం దుకే దుండగులు యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారన్నారు. పెళ్లాడాలని తన వెంట పడిన పోకిరీ మాట వినలేదనే తనపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత అతనికి న్యాయస్థానం శిక్ష విధించిందని తెలిపారు. దోషులను శిక్షించడంతో ప్రభుత్వం చేతులు దులుపుకోకూడదన్నారు. యాసిడ్ దాడుల బాధితులకు సరైన పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. యాసిడ్ దాడులకు గురైన మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏ సంస్థ కూడా సమ్మతించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బీపీవోలో ఉద్యోగం ఇచ్చేందుకు ఓ సంస్థ నిరాకరించిన విషయాన్ని ఆమె వెల్లడించారు. స్వచ్ఛమైన మనసుతో కూడిన అంతః సౌందర్యం, ఆత్మవిశ్వాసమే నిజమైన అందం అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆమె ఉద్బోధించారు. సాధికారతపై ఇంకా మాటలేనా?: బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షర్మిన్ చౌదరి సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యం ఉనికిలోకి వచ్చి ఎన్నో ఏళ్లయినా ఇంకా మహిళా సాధికారత గురించి చర్చించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షిరిన్ షర్మిన్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన, సమానత్వం కోసం మహిళలు ప్రారంభించిన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ మహిళా పార్లమెంటులో ఆమె ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం టెక్నాలజీ టైమ్ నడుస్తోందని, ప్రపంచీకరణతో అన్నిచోట్లా ఇది విస్తరించడంతో అందరి జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఇంకా మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి మహిళలోనూ అనేక నైపుణ్యాలుంటాయని, వాటితోపాటు ఓర్పు, సహనం వారి సొంతమన్నారు. నాయకత్వం మనలోనే ఇమిడి ఉంటుంది: కిరణ్‌బేడి మహిళలకు అవకాశాలు కుటుంబం నుంచి మొదలై పాఠశాల, సమాజ స్థాయిలో వివిధ రకాలుగా వస్తాయని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్‌బేడి అన్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ముం దుకెళ్లాల్సి ఉంటుందన్నారు. నాయకత్వ స్థాయికి చేరుకోవడంతోపాటు దాన్ని ఉపయోగించుకుని ఎదిగేందుకు ప్రయత్నించాలన్నారు. నాయకత్వం ఎక్కడో బయట ఉండదని, మనలోనే ఉంటుందని తెలిపారు. కెన్యా పార్లమెంట్లో 20 శాతమే: లబొసె తమ దేశ పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యం 20 శాతమే ఉందని కెన్యా డిప్యూటీ స్పీకర్ జొయ్‌సె లబొసె చెప్పారు. 30 శాతం మంది మహిళలను పార్లమెంట్‌కు నడిపించేందుకు తాము పోరాటం చేస్తున్నామన్నారు. అనేక దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని, తమ హక్కు ల కోసం మహిళలు పోరాడాలని కోరారు.