యాసిడ్‌ బాధితురాలిగా... | Deepika Padukone to play acid attack survivor Laxmi Agarwal in biopic | Sakshi
Sakshi News home page

యాసిడ్‌ బాధితురాలిగా...

Published Fri, Dec 14 2018 6:05 AM | Last Updated on Fri, Dec 14 2018 6:05 AM

Deepika Padukone to play acid attack survivor Laxmi Agarwal in biopic - Sakshi

దీపికా పదుకోన్‌

దాదాపు పదమూడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో యువతి లక్ష్మీ అగర్వాల్‌పై జరిగిన యాసిడ్‌ దాడి విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ దాడి నుంచి కోలుకున్న తర్వాత లక్ష్మీ అగర్వాల్‌ జీవితంలో ముందడుగు వేశారు. ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆమె జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందనుంది. ‘తల్వార్, రాజీ’ చిత్రాల ఫేమ్‌ మేఘనా గుల్జార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. లక్ష్మీ అగర్వాల్‌ పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ నటిస్తారు.

వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ‘‘లక్ష్మీ అగర్వాల్‌ కేసులో సోషియో–మెడికల్‌ అండ్‌ లీగల్‌ ఇంపాక్ట్‌ కనిపిస్తోంది. అందుకే ఈ సినిమాలో యాసిడ్‌ బాధితుల గురించి లార్జ్‌ స్కేల్‌లో చూపించాలనుకుంటున్నాం. యాసిడ్‌ అమ్మకాన్ని దేశంలో బ్యాన్‌ చేశారు. కానీ ఇప్పటికీ టైర్‌–3 పట్టణ ప్రాంతాల్లో యాసిడ్‌ను కిరాణా స్టోర్స్‌లో అమ్ముతున్నారు’’ అని పేర్కొన్నారు మేఘనా. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ చిత్రంతో నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు దీపికా పదుకోన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement