ముంబై: సాటి మనుషులను చూసే విధానం మారాలి అంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఛపాక్. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో దీపిక మాల్తీగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఛపాక్‌తో తొలిసారిగా నిర్మాత అవతారమెత్తిన దీపిక... రియాలిటీ షోలకు హాజరవుతూ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఛపాక్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.