భారీ చిత్రాలకు లీకుల బెడద తప్పటం లేదు. టాప్‌స్టార్లు నటించే సినిమాలు ఆన్ లొకేషన్ ఫోటోలు, వీడియోలు ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. తాజాగా మరో భారీ చిత్రం లీకువీరుల బారిన పడింది. దీపిక పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.