సినిమాల్లోని కొన్ని పాత్రలు ప్రేక్షకులకే కాదు, నటులకు కూడా ఎంతగానో నచ్చుతాయి. అలా వారు నటించిన పాత్ర లేదా సినిమా గురించి మాట్లాడే సందర్భంలో వారు ఉద్వేగానికి లోనవుతుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఎమోషనల్ అయింది. ఆమె తాజాగా నటించిన చిత్రం ‘ఛపాక్’. ఈ సినిమా ట్రైలర్‌ను ముంబైలో మంగళవారం రిలీజ్ చేశారు. అయితే, యాసిడ్ దాడి బాధితురాలు లక్షీ అగర్వాల్ పాత్రలో నటించిన దీపిక చిత్ర ట్రైలర్ విడుదల సమయంలో మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. చిత్ర విశేషాలను చెప్తున్న క్రమంలో దీపిక కన్నీళ్లు పెట్టుకున్నారు.