రేపే ట్రైలర్ విడుదల: దీపికా | Deepika Padukone Share Chhapak Teaser In Twitter | Sakshi
Sakshi News home page

రేపే ట్రైలర్ విడుదల: దీపికా

Published Mon, Dec 9 2019 3:07 PM | Last Updated on Mon, Dec 9 2019 3:15 PM

Deepika Padukone Share Chhapak Teaser In Twitter - Sakshi

ముంబై: బాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె నటిస్తున్న తాజా చిత్రం ఛపాక్‌. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా దీపిక స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా దీపికా ఈ సినిమాకి సంబంధించిన ఆరు సెకన్ల టీజర్‌ను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీనికి ‘ ఛపాక్‌ చిత్రం ట్రైలర్‌ రేపు( మంగళవారం) విడుదలవుతుంది. తప్పక చూడండి’ అంటూ ఆమె కామెంట్‌ చేశారు. వెరైటీగా ఉన్న ఈ టీజర్‌లో ‘రేపు ట్రైలర్‌ విడుదల’ అని కనిపిస్తుంది. ఇలా కథకు దగ్గరగా కొత్తగా ఉన్న టీజర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ టీజర్‌ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో దీపికా లుక్‌కు సంబంధించి పలు ఫోటోలను ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్‌ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.

చిత్ర దర్శకురాలు మేఘనా గుల్జార్‌ ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. దీపికా ఇప్పటి వరకు నటించిన సినిమాలకు పూర్తి భిన్నమైన నటన ఉంటుందని తెలిపారు. తన నటనతో ఈ సినిమా మరో స్థాయికి చేరుతుందని పేర్కొన్నారు. షూటింగ్‌ సమయంలో దీపికా నవ్వే విధానం కూడా అచ్చం లక్ష్మీ అగర్వాల్‌లా ఉందని.. అంత బాగా దీపికా నటించిందని దర్శకురాలు మేఘనా గుల్జార్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement