Malavika Mohanan Would Like To Act In Aishwarya Rai Biopic Movie: ఐశ్వర్య రాయ్ బయోపిక్‌లో నటించాలనుందనే కోరికను హీరోయిన్ మాళవిక మోహనన్ వ్యక్తం చేశారు. మాళవిక మోహనన్ 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కోలీవుడ్‌లో తొలిసారిగా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'పేట' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తెలుగులో విడుద కాగా ఆ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ధనుష్‌తో జత కట్టిన 'మారన్' చిత్రం ఈ నెల 11వ తేదిన విడుదల కానుంది.
ఇందులో నటించిన అనుభవాన్ని మాళవిక మీడియాతో పంచుకుంటూ తాను ఇంతకుముందు నటించిన చిత్రాలు అన్నింటికంటే పూర్తి నిడివి గల పాత్రను ఈ చిత్రంలోనే చేశానన్నారు. సోషల్ మీడియా రాతలు కష్టం కలిగిస్తున్నా, అలాంటివి మంచి అనుభవం కూడా అని పేర్కొన్నారు. ఐశ్వర్యరాయ్ బయోపిక్‌తో చిత్రాన్ని నిర్మిస్తే అందులో నటించాలను ఉందన్నారు. ఇదిలా తన గ్లామర్ ఫొటోలతో తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు మాళవిక మోహనన్. ఆ మధ్య బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌తో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు తెగ షికార్లు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment