
దుబాయ్‌లో పరుగు ప్రారంభించారు తాప్సీ. యాక్షన్ అనడం ఆలస్యం పరుగులు తీయడానికి సిద్ధంగా ఉంటున్నారు. తాప్సీ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘రష్మీ రాకెట్’. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజల్ నిర్మిస్తున్నారు. ఇందులో రన్నర్‌గా నటిస్తున్నారు తాప్సీ. గుజరాత్‌లో ఓ మారుమూల గ్రామంలో ఉండే అమ్మాయి రష్మీ. ఆమె వేగాన్ని చూసి అందరూ రాకెట్ అంటుంటారు. మరి ఆ రాకెట్ ఎందాకా వెళ్లగలిగింది అనేది చిత్రకథాంశం. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా దుబాయ్‌లో ప్రారంభం అయింది. ‘మరో కొత్త ప్రయాణం ప్రారంభం అయింది. హసీనా (తన గత చిత్రం ‘హసీనా దిల్‌రుబా’లో పాత్రను ఉద్దేశించి) నుంచి రాకెట్‌గా మారిపోయాను’’ అన్నారు తాప్సీ.
Comments
Please login to add a commentAdd a comment