ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రగా మారబోతున్నారు హాలీవుడ్ అందాల తార గాల్ గాడోట్. క్వీన్ క్లియోపాత్ర జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా గాల్ గాడోట్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘దర్శకురాలు ప్యాటీ జెన్కిన్స్‌తో కలసి క్లియోపాత్ర జీవితాన్ని తెర మీద చూపించబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఆమె కథను స్త్రీ దృష్టి కోణంలో (చిత్రదర్శకురాల్ని ఉద్దేశించి) చూపించబోతున్నాం’ అని ట్వీట్ చేశారు గాల్. గతంలో ప్యాటీ జెన్కిన్స్ దర్శకత్వంలో ‘వండర్ ఉమెన్’ సిరీస్‌లో రెండు చిత్రాల్లో నటించారు గాల్. ‘వండర్ ఉమెన్’ సీక్వెల్ ‘వండర్ ఉమెన్ 1984’ క్రిస్మస్‌కి విడుదల కానుంది. గతంలో క్లియోపాత్ర పాత్రను ఎలిజిబెత్ టేలర్ చేశారు. 1963లో తెరకెక్కిన ఆ సినిమా 4 ఆస్కార్ అవార్డులు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment