ఎప్పుడూ ఎవరో ఒకరి బయోపిక్‌లు, రియల్ స్టోరీలు తీస్తూ అందరికీ ముచ్చెమటలు పట్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ జీవితం సినిమాగా రాబోతోంది. ఈ చిత్రానికి దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. నిజానికి ఆర్జీవీ గురించి చెప్పడానికే మాటలు సరిపోవు, అలాంటిది రెండు, మూడు గంటల్లో ఆయన నిజ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడం కష్టం కాబట్టి బయోపిక్‌ను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఒక్కో భాగం రెండు గంటలుంటుంది. ముందు రెండు భాగాల్లో వేరే నటులు నటించబోతుండగా చివరి భాగంలో ఆర్జీవీయే స్వయంగా నటించనున్నారు. (చదవండి: తెరకెక్కనున్న రామ్ గోపాల్ వర్మ బయోపిక్)
తాజాగా ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. "నగ్నసత్యంగా నా జీవితాన్ని చూపించనున్నాను. నా లైఫ్‌లో జరిగిన సంఘటనల గురించి చిత్రయూనిట్‌కు తెలిపాను. కానీ వాళ్లు అప్పటికే నా గురించి పరిశోధన చేసి చాలావరకు తెలుసుకున్నారు. 2008 డిసెంబర్‌లో ముంబై పేలుళ్ల తర్వాత నేను, నటుడు రితేష్ దేశ్‌ముఖ్ తాజ్ హోటల్‌కు వెళ్లాం. అప్పుడేం జరిగిందనే వివరాలు కూడా సినిమాలో చూపిస్తాం. నిజానికి ఆ సమయంలో అక్కడికి వెళ్లడమే తప్పు కాబట్టి ఈ విషయాన్ని నేనెప్పుడూ వెల్లడించలేదు. మొదటి రెండు భాగాల కన్నా మూడో భాగంలో నా చుట్టూ అలుముకున్న వివాదాలు, శృంగార సన్నివేశాలు ఉంటాయి. నేను రంగుల జీవితాన్ని అనుభవించాను. కాబట్టి అమ్మాయిలతో పెట్టుకున్న సంబంధాలను కూడా చూపిస్తాను. సినిమాలో అదే ఎక్కువగా రక్తికడుతుందని నేను భావిస్తున్నాను" అని తెలిపారు. (చదవండి: ప్రభాస్ వర్క్ ఫ్రమ్ హోమ్!)
Comments
Please login to add a commentAdd a comment