ఏప్రిల్‌లో పెళ్లి | Actors Richa Chadha and Ali Fazal to get married in April | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో పెళ్లి

Published Tue, Mar 17 2020 12:48 AM | Last Updated on Tue, Mar 17 2020 12:48 AM

Actors Richa Chadha and Ali Fazal to get married in April - Sakshi

అలీ ఫజల్, రిచా చద్దా

నాలుగేళ్ల ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడానికి బాలీవుడ్‌ నటుడు అలీ ఫజల్, నటి రిచా చద్దా రెడీ అయిపోయారు. రిజిస్టర్‌ ఆఫీసులో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుకలు చేసుకుంటారట. అందుకని రిజిస్ట్రేషన్‌ కోసం ముంబై కోర్టులో అప్లికేషన్‌ పెట్టుకున్నారని సమాచారం. ఏప్రిల్‌ చివరి వారంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని ఇద్దరి సన్నిహితులు పేర్కొన్నారు. 2017లో ‘ఫక్రీ రిటర్న్స్‌’లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రిచా పంజాబీ అమ్మాయి. అలీది ఉత్తర్‌ప్రదేశ్‌. పెద్దల అంగీకారంతోనే వీరి పెళ్లి జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement