సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Tollywood The 100 Movie OTT Release Date Announced, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

The 100 OTT Release: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aug 29 2025 7:18 AM | Updated on Aug 29 2025 12:02 PM

Tollywood Movie Ott Streaming from Today on This Platform

ఆర్‌కే సాగర్, మిషా నారంగ్‌ జోడీగా నటించిన చిత్రం ది 100. మూవీలో ధన్యా బాలకృష్ణ కీలకపాత్ర పోషించింది. జూలై 11 థియేటర్లలోకి వచ్చిన సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. పోలీస్ డ్రామాగా వచ్చిన చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మూవీని రమేశ్‌ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించారు.

తాజాగా చిత్రం సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. విషయాన్ని డైరెక్టర్రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అమెజాన్ప్రైమ్తో పాటు లయన్స్గేట్ ప్లే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోందని తెలిపారు. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. చిత్రంలో ఆర్కే సాగర్ఐపీఎల్అధికారి విక్రాంత్ పాత్రలో మెప్పించారు. పోలీస్‌ యాక్షన్‌ చిత్రాలు ఇష్టపడేవారు ది 100 చూసి ఎంజాయ్ చేయండి. 

(ఇది చదవండి: ‘ది 100’ మూవీ రివ్యూ)

గతంలో దర్శకుడు రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ మాట్లాడుతూ'సమాజంలోని సవాళ్ల గురించి తీసిన సినిమా ఇది. ప్రతి ఇంట్లో విక్రాంత్‌లాంటి క్యారెక్టర్‌ ఉండాలని ప్రేక్షకులు కోరుకోవడం నాకు నచ్చింది. మా చిత్రానికి ముఖ్యంగా మహిళలు చాలా కనెక్ట్‌ అవుతున్నారు. ప్రేక్షకులు పతాక సన్నివేశాల్లో చప్పట్లు కొడుతుండటం సంతోషంగా ఉంది' అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement