'ప్రేమించొద్దు' (Preminchoddu ) అనే చిన్న సినిమా ఓటీటీలోకి (OTT) వచ్చేసింది. ‘బందూక్, శేఖరంగారి అబ్బాయి’ చిత్రాల ఫేమ్ అనురూప్ రెడ్డి హీరోగా నటించిన ఈ చిత్రంలో దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించారు. శిరిన్ శ్రీరామ్ (Shirin Sriram) స్వీయ దర్శకత్వంలో 5 భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది జూన్ 7న విడుదలైంది. బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ మూవీ నిర్మించారు. యువతలో చాలామంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తుంటారు. ఇది వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే కోణంలో ‘ప్రేమించొద్దు’ అనే శీర్షికతో ఈ సినిమాను తెరకెక్కించనట్లు శిరిన్ శ్రీరామ్ తెలిపారు.
ఐఎమ్‌డీబీలో 8 రేటింగ్‌తో ప్రేమించొద్దు చిత్రం ఉంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 10 నుంచి రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు బీసినీట్ (Bcineet OTT) ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా అందుబాటులో ఉంది.
(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. ఫ్యాన్స్‌లో నిరాశ)
వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ గతంలో తెలిపాడు. ట్రైలర్ కూడా చాలా ఆసక్తిగానే ఉండటంతో థియేటర్స్‌లో కాస్త పర్వాలేదనిపించింది. బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా ఉంటుంది. నేటి తరం తల్లిదండ్రులు, పిల్లలు చూసేలా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు. పాఠశాల నుంచి కాలేజీ స్థాయిలో ఉండే లవ్ స్టోరీలు.. వాటి వల్ల చదువుల్ని నిర్లక్ష్యం చేయడంతో వచ్చే నష్టాలు, తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను కళ్ళకు కట్టినట్లు 'ప్రేమించొద్దు' చిత్రంలో చూపించారు.
బేబి సినిమా వివాదంతో శిరిన్ శ్రీరామ్ వైరల్
తన ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్ శ్రీరామ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్ అందుబాటులోకి కూడా ఆయన తీసుకోచ్చారు. ఆ సమయంలో ఈ టాపిక్ టాలీవుడ్‌లో చర్చనీయాశంగా మారింది. తన కథను కాపీ కొట్టి బేబీ సినిమా తీశారని ఆయన చాలా సార్లు చెప్పారు.
తనకు దర్శకత్వం అవకాశం ఇస్తానని తన వద్ద ఉన్న కథను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే సినిమా తీశాడని శిరిన్ ఆరోపించారు. అయితే, తాజాగా ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమించొద్దు సినిమా స్టోరీ కూడా బేబీ సినిమాకు దగ్గరగానే ఉంటుంది. అందువల్ల సోషల్‌మీడియాలో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment