రవితేజ 'రావణాసుర'కు ముహుర్తం ఫిక్స్‌.. త్వరలో | Raviteja Ravanasura Movie Opening Ceremony In Hyderabad | Sakshi
Sakshi News home page

Ravanasura Movie: రవితేజ 'రావణాసుర'కు ముహుర్తం ఫిక్స్‌.. త్వరలో

Published Sun, Jan 2 2022 9:25 PM | Last Updated on Sun, Jan 2 2022 9:25 PM

Raviteja Ravanasura Movie Opening Ceremony In Hyderabad - Sakshi

ఎలాంటి బ‍్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి తనకంటూ ఒక మాస్ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు మాస్‌ మహారాజా రవితేజ. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'క్రాక్‌' మూవీ విజయంతో ఫుల్‌ జోష్‌తో సినిమాలు తీస్తున్నాడు. ప్రస్తుతం 'ఖిలాడీ' చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకోగా 'రామారావు ఆన్‌ డ్యూటీ' షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నారు. అయితే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 70వ చిత్రం 'రావణాసుర'. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ 70వ చిత్రానికి ఇలాంటి పవర్‌ఫుల్‌ టైటిల్‌ పెట్టడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. 

సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న రావణాసుర చిత్రం షూటింగ్‌ను త్వరలో ప్రారంభిస్తారని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రావణాసుర చిత్ర ప్రారంభోత్సవం జరుగుతుందని మూవీ టీమ్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌ వేదికగా ఉదయం 9:50 గంటలకు ముహుర్తం ఉందని సమాచారం. ఇక ముహుర్తానంతరం సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను జరుపుకోనుంది. శ్రీకాంత్‌ విస్సా కథ అందించిన ఈ సినిమాను అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రవితేజ తన 71వ సినిమాను కూడా ప్రకటించాడు.  అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కబోతున్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ఇది.
 


ఇదీ చదవండి: ఫ్లాప్‌ అయితే రెమ్యునరేషన్‌లో కొంత వెనక్కిచ్చేస్తా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement