shooting opening
-
రవితేజ 'రావణాసుర'కు ముహుర్తం ఫిక్స్.. త్వరలో
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక మాస్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'క్రాక్' మూవీ విజయంతో ఫుల్ జోష్‌తో సినిమాలు తీస్తున్నాడు. ప్రస్తుతం 'ఖిలాడీ' చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకోగా 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నారు. అయితే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 70వ చిత్రం 'రావణాసుర'. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ 70వ చిత్రానికి ఇలాంటి పవర్ఫుల్ టైటిల్ పెట్టడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న రావణాసుర చిత్రం షూటింగ్‌ను త్వరలో ప్రారంభిస్తారని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రావణాసుర చిత్ర ప్రారంభోత్సవం జరుగుతుందని మూవీ టీమ్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్ వేదికగా ఉదయం 9:50 గంటలకు ముహుర్తం ఉందని సమాచారం. ఇక ముహుర్తానంతరం సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. శ్రీకాంత్ విస్సా కథ అందించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రవితేజ తన 71వ సినిమాను కూడా ప్రకటించాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కబోతున్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ఇది. Grand Pooja Ceremony 🪔 of 𝑴𝒂𝒔𝒔 𝑴𝒂𝒉𝒂𝑹𝒂𝒋𝒂 @RaviTeja_offl ’s #RAVANASURA🔥 🗓14th January ,Friday 2022 ⏳9:50 AM 📍Annapurna Studios@sudheerkvarma @AbhishekPicture @RTTeamWorks @SrikanthVissa pic.twitter.com/GeFLDh7nF6 — BA Raju's Team (@baraju_SuperHit) January 2, 2022 ఇదీ చదవండి: ఫ్లాప్ అయితే రెమ్యునరేషన్లో కొంత వెనక్కిచ్చేస్తా -
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభం
హైదరాబాద్: 'సర్దార్ గబ్బర్ సింగ్' ధియేటర్లలో ఉండగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో నిరాడంబరంగా జరిగింది. దేవుడి చిత్రపటాలపై ముహూర్తపు షాట్ తీశారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) : ముహూర్తపు షాట్ కు నిర్మాత సుధాకర్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఎడిటర్ గౌతంరాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఎస్ జె సూర్య మొదటి సన్నివేశాన్ని డైరెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్, పంచె కట్టుతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' నిర్మాత శరత్ మారార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యాక్షన్ లీడర్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్నాడు. కాగా, ఈ సినిమాను 29న ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్-ఎస్ జె సూర్య కాంబినేషన్ లో వచ్చిన 'ఖుషి' సినిమా విడుదలై నేటికి 15 ఏళ్లు పూర్తి కావడం, ముహూర్తం కూడా కుదరడంతో ఈరోజే సినిమా ప్రారంభించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు రెండు సినిమాలు వచ్చాయి.