
‘‘రవితేజగారితో ఇది వరకే ‘ఖిలాడి’ సినిమాకు వర్క్ చేశాను. ఇప్పుడు ఆయన హీరోగా చేసిన ఈ ‘రావణాసుర’తో పాటు ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకూ వర్క్ చేస్తున్నాను. నేను చెప్పే కథలు రవితేజగారికి నచ్చుతున్నాయి. అందుకే ఆయనతో వెంట వెంటనే అసోసియేట్ కావడం వీలవుతోంది’’ అన్నారు రైటర్ శ్రీకాంత్ విస్సా. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘రావణాసుర’.
సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఈ చిత్ర రచయిత శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ..‘‘ప్రతి హీరోలో ఓ విలన్ ఉన్నట్లే ప్రతి విలన్‌లో ఓ హీరో ఉంటాడు. ‘రావణాసుర’ కాన్సెప్ట్ అదే. ఆ రావణాసురుడిలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో.. రవితేజగారి పాత్రలోనూ అన్ని ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’, కల్యాణ్‌రామ్ ‘డెవిల్’ చిత్రాలు చేస్తున్నాను. నా అంతిమ లక్ష్యం దర్శకత్వమే’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment