
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ‘‘ఈ షెడ్యూల్‌లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం.
రవితేజ లాయర్‌గా కనిపించనున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన రవితేజ, సుశాంత్ ఫస్ట్ లుక్స్‌కి మంచి స్పందన వచ్చింది. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి పవర్‌ఫుల్ కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అందించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్,కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సీఈఓ: పోతిని వాసు.
Comments
Please login to add a commentAdd a comment