Ravi Teja Ravanasura Dialogue Leaked in Online - Sakshi
Sakshi News home page

కంచం ముందుకు, మంచం మీదకు పిలవగానే రావాలి.. లీకైన రవితేజ డైలాగ్‌

Published Thu, Apr 6 2023 8:02 PM | Last Updated on Thu, Apr 6 2023 8:31 PM

Ravi Teja Dialogue Leaked From Ravanasura - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రావణాసుర. సుధీర్‌ వర్మ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో దక్షా నగార్కర్‌, అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అభిషేక్‌ నామా, రవితేజ నిర్మించారు. రేపు(ఏప్రిల్‌ 7న) ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రావణాసుర నుంచి ఓ డైలాగ్‌ వీడియో లీకైంది.

ఇందులో రవితేజ.. కంచం ముందుకి, మంచం మీదకి ఆడపిల్లలు పిలవంగనే రావాలి.. లేకపోతే నాకు మండుద్ది అని రాక్షసంగా డైలాగ్‌ చెప్పాడు. ఈ డైలాగ్‌ అభ్యంతరకరంగా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. రవితేజ ఫ్యాన్స్‌ మాత్రం.. రావణాసుర అంటే ఆ మాత్రం ఉంటుంది. నెగెటివ్‌ షేడ్‌కు తగ్గట్లు డైలాగ్‌ లేకపోతే ఎలా? అని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ డైలాగ్‌ వీడియో మాత్రం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement