Daksha Nagarkar As Vilain In Raviteja Ravanasura Movie: చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంచలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు రవితేజ. 'ఇడియట్'గా అమ్మాయిల మనసుల్లోకి దూరి ఓటమి ఎదురైనా సరే విజయం కోసం పట్టువదలని 'విక్రమార్కుడు'గా తానేంటో నిరూపించుకుని విమర్శకులతో సైతం 'రాజా ది గ్రేట్' అనిపించుకున్న 'వెంకీ'.. తనకు సినిమాపై ఉన్న 'క్రాక్'తో మరోసారి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇక వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ తర్వాత రవితేజ 70వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా రావణాసుర. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్వకత్వం వహిస్తున్నారు. అయితే ఇంతటి పవర్‌ఫుల్ టైటిల్ పెట్టడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఇదీ చదవండి: ఆ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్ చేశా: పూజా హెగ్డె
అందుకు తగినట‍్లే మూవీ క్యాస్టింగ్‌ను ఎంపిక చేసే పనిలో పడింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో రవితేజ కోసం ఒక శక్తిమంతవమైన లేడీ విలన్ రోల్‌ను తీర్చిదిద్దనున్నారట. ఈ పాత్ర కోసం హుషారు, జాంబీరెడ్డి ఫేమ్ దక్షా నాగర్కర్‌ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ పాత్రకు దక్షా కూడా ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది. జాంబీ రెడ్డి, హుషారు, హోరాహోరీ చిత్రాల్లో తన అందచందాలతో ఆకట్టుకున్న దక్షా ఈ సినిమాలో లాయర్‌గా సందడి చేయనున్న రవితేజను ఎలా ఢీకొట్టనుందో అని అభిమానుల్లో ఆసక్తిరేకెత్తిస్తోంది ఈ ముంబై భామ. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన 'రావణాసుర' చిత్రం జనవరి 14న పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: రవితేజ 'రావణాసుర'కు ముహుర్తం ఫిక్స్.. త్వరలో
Comments
Please login to add a commentAdd a comment