vilan
-
డాక్టర్‌తో 'పుష్ప' విలన్ ధనంజయ నిశ్చితార్థం (ఫొటోలు)
-
ఒకవైపు విలనిజం మరోవైపు హాస్యం
-
లాయర్‌గా రవితేజ సందడి.. విలన్‌గా అందాల తార ఢీ
Daksha Nagarkar As Vilain In Raviteja Ravanasura Movie: చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంచలంచెలుగా ఎదిగి మాస్ మాహారాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు రవితేజ. 'ఇడియట్'గా అమ్మాయిల మనసుల్లోకి దూరి ఓటమి ఎదురైనా సరే విజయం కోసం పట్టువదలని 'విక్రమార్కుడు'గా తానేంటో నిరూపించుకుని విమర్శకులతో సైతం 'రాజా ది గ్రేట్' అనిపించుకున్న 'వెంకీ'.. తనకు సినిమాపై ఉన్న 'క్రాక్'తో మరోసారి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇక వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ తర్వాత రవితేజ 70వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా రావణాసుర. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్వకత్వం వహిస్తున్నారు. అయితే ఇంతటి పవర్ఫుల్ టైటిల్ పెట్టడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇదీ చదవండి: ఆ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్ చేశా: పూజా హెగ్డె అందుకు తగినట్లే మూవీ క్యాస్టింగ్‌ను ఎంపిక చేసే పనిలో పడింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో రవితేజ కోసం ఒక శక్తిమంతవమైన లేడీ విలన్ రోల్‌ను తీర్చిదిద్దనున్నారట. ఈ పాత్ర కోసం హుషారు, జాంబీరెడ్డి ఫేమ్ దక్షా నాగర్కర్ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ పాత్రకు దక్షా కూడా ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది. జాంబీ రెడ్డి, హుషారు, హోరాహోరీ చిత్రాల్లో తన అందచందాలతో ఆకట్టుకున్న దక్షా ఈ సినిమాలో లాయర్‌గా సందడి చేయనున్న రవితేజను ఎలా ఢీకొట్టనుందో అని అభిమానుల్లో ఆసక్తిరేకెత్తిస్తోంది ఈ ముంబై భామ. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన 'రావణాసుర' చిత్రం జనవరి 14న పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇదీ చదవండి: రవితేజ 'రావణాసుర'కు ముహుర్తం ఫిక్స్.. త్వరలో -
విలన్ విజయ్!
ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటు అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్లో వడివడిగా ముందుకు అడుగులు వేస్తున్నారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. చిరంజీవి ‘సైరా: నరసింహా రెడ్డి’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్న సినిమాలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతిది విలన్ పాత్ర అని సమాచారం. దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేసిన బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. మేలో షూటింగ్ ప్రారంభం కానుంది. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై రూపొందనున్న ఈ సినిమాకి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, కెమెరా: శ్యామ్ దత్ సైనుద్దీన్. -
మహర్షికి విలన్?
కెరీర్ స్టార్టింగ్‌లో హీరోగా సినిమాలు చేసిన నటుడు సాయికుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. వీలైనప్పుడు ప్రతినాయకుడి పాత్రలు చేస్తున్నారు. ‘సామాన్యుడు, ప్రస్థానం, ఎవడు’ చిత్రాల్లో ఆయన విలనిజమ్‌కి మంచి మార్కులు వేశారు ప్రేక్షకులు. తాజాగా మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షి’ సినిమాలో సాయికుమార్ విలన్‌గా నటిస్తున్నారని సమాచారం. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఎవడు’ చిత్రానికి కూడా వంశీ పైడిపల్లియే దర్శకుడనే విషయం తెలిసిందే. ఆ చిత్రంలో సాయికుమార్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ‘మహర్షి’లో కూడా మంచి పాత్ర డిజైన్ చేసి ఉంటారని ఊహించవచ్చు. ‘మహర్షి’ సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకుంటున్నారు. -
రీ–ఎంట్రీతో వినిపించబోతున్నారు
‘ఇడియట్, శివమణి’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బెంగళూరు బ్యూటీ రక్షిత. 2007లో దర్శకుడు ప్రేమ్‌తో పెళ్లి జరగడంతో సినిమాలకు స్వస్తి చెప్పేశారామె. సిల్వర్ స్క్రీన్కు దూరం అయినప్పటికీ టెలివిజన్ షోలకు న్యాయ నిర్ణేతగా చేస్తున్నారు రక్షిత. ఆల్మోస్ట్ పదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు రక్షిత. కానీ ఈసారి రక్షిత కనిపించరు.. వినిపించబోతున్నారు. సుదీప్, శివరాజ్ కుమార్ హీరోలుగా భర్త ప్రేమ్ రూపొందిస్తున్న కన్నడ సినిమా ‘విలన్’లో హీరోయిన్ అమీ జాక్సన్ పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నారట. ‘‘ప్రేమ్‌తో వర్క్ చేయడం అంత సులువేం కాదు. అతను పర్ఫెక్షనిస్ట్. కొన్నికొన్ని సార్లు డైలాగ్‌ను 20 సార్లు చెప్పించేవారు. ఎంత పెద్ద డైలాగ్‌ని అయినా ముక్కలుగా కట్ చేసి చెప్పించరు. మొత్తం చెప్పాల్సిందే. ఎన్ని టేక్స్ అయినా ఆయనకు సంబంధం లేదు. గతంలో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాను. కానీ వేరే వాళ్లకు డబ్ చేయడం చాలా డిఫరెంట్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు రక్షిత. -
అమ్మాయిలందరూ నన్ను ద్వేషిస్తారని భావించా..
మర్దానీ ఫేం తాహిర్ రాజ్ బాసిన్ న్యూఢిల్లీ: ‘నేను అనుకున్నంతా అయ్యింది.. ‘మర్దానీ’ సినిమా చేసినప్పుడు నా పాత్రను చూసి అమ్మాయిలందరూ నన్ను ద్వేషిస్తారని భావించా.. సినిమా విడుదలయ్యాక నేను ఊహించినట్లే జరిగింది..’ అని మర్దానీ సినిమా ద్వారా సినిమా పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసిన ఢిల్లీ వాసి తాహిర్ రాజ్ బాసిన్ తెలిపాడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ టైటిల్ పాత్ర పోషించింది. ఇందులో ఆమె పవర్ఫుల్ పోలీస్ అధికారిణిగా నటించగా అమ్మాయిల అక్రమ రవాణా వ్యాపారం చేసే దుర్మార్గమైన వ్యక్తిగా 27 యేళ్ల తాహిర్ నటించాడు. ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద మంచి టాక్ సంపాదించింది. దీనిపై తాహిర్ ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ ఈ సినిమా చేసేటప్పుడు నా పాత్ర స్వభావం చూసి అమ్మాయిలు నన్ను అసహ్యించుకుంటారని భావించా.. అయితే అమ్మాయిలు అందులో నా స్టైల్‌ను మాత్రం ఇష్టపడ్డారు..’ అని అన్నాడు. ఈ సినిమాలో చాలా బాగున్నానని సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ట్విటర్లో ట్వీట్ చేయడం నాకు అవార్డు వచ్చినంత ఆనందం ఇచ్చిందని చెప్పాడు. ఈ సినిమాలో నటించేందుకు మొదట చాలా ఇబ్బంది పడ్డానని ఆయన అన్నాడు. ప్రధాన పాత్రలో సీనియర్ నటి రాణీ ముఖర్జీ నటిస్తుండటంతో ఆమెతో స్క్రీన్‌ను పంచుకోవడానికి కొంచెం తడబడ్డానని తెలిపాడు. ఆమె సినిమాలు చూస్తూ పెరిగిన తనకు ఆమెతోనే నటించడమనేసరికి ఒకరకమైన ఒణుకు వచ్చిందని నవ్వుతూ చెప్పాడు. అయితే రాణి మాత్రం తనకు అన్నివిధాల మద్దతు ఇచ్చిందని, తనను కొత్త నటుడుడి చూడలేదని దాంతో త్వరలోనే మామూలుగానే నటించగలిగానని తాహిర్ అన్నాడు. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో పాత్ర సంపాదించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని తాహిర్ వివరించాడు. నాలుగేళ్లుగా తాను ముంబైలో ఉంటూ సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్నానని, అందులో భాగంగా రెండేళ్ల కిందట యశ్‌రాజ్ ఫిల్మ్స్ కాస్టింగ్ డెరైక్టర్ షనూ శర్మను కలిసి తన ఫొటోలు చూపించానన్నాడు. కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఈ సినిమాలో అవకాశం కోసం స్క్రీన్ టెస్ట్‌కు రావాలని ఆమెనుంచి ఆహ్వానం అందిందని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి అప్పటికే సుమారు 200 మందికిపైగా లైన్లో ఉన్నారని వివరించాడు.. చివరికి ఆ పాత్ర తనను వరించడం ఆనందంగా ఉందన్నాడు. బాలీవుడ్లో విలన్ పాత్రతో కెరీర్‌ను ప్రారంభించడంపై ఆయన మాట్లాడుతూ.. దానిపై తనకు ఎటువంటి బాధ లేదన్నాడు. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న విలన్ పాత్రధారులెవరూ నేను చేసిన పాత్రను చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. అంత నీచమైన నేరప్రవృత్తిగల ఒక శాడిస్టు పాత్ర కాబట్టే నటించడానికి చాలా అవకాశం లభించింది. మున్ముందు కూడా ఇలాంటి పాత్రలొస్తే చాలెంజ్‌గా తీసుకుని నటిస్తాను..’ అని ముక్తాయించాడు.