
సాయికుమార్
కెరీర్ స్టార్టింగ్‌లో హీరోగా సినిమాలు చేసిన నటుడు సాయికుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. వీలైనప్పుడు ప్రతినాయకుడి పాత్రలు చేస్తున్నారు. ‘సామాన్యుడు, ప్రస్థానం, ఎవడు’ చిత్రాల్లో ఆయన విలనిజమ్‌కి మంచి మార్కులు వేశారు ప్రేక్షకులు. తాజాగా మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షి’ సినిమాలో సాయికుమార్ విలన్‌గా నటిస్తున్నారని సమాచారం. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఎవడు’ చిత్రానికి కూడా వంశీ పైడిపల్లియే దర్శకుడనే విషయం తెలిసిందే. ఆ చిత్రంలో సాయికుమార్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ‘మహర్షి’లో కూడా మంచి పాత్ర డిజైన్ చేసి ఉంటారని ఊహించవచ్చు. ‘మహర్షి’ సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment