
విజయ్ సేతుపతి
ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటు అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌లో వడివడిగా ముందుకు అడుగులు వేస్తున్నారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. చిరంజీవి ‘సైరా: నరసింహా రెడ్డి’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్న సినిమాలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతిది విలన్ పాత్ర అని సమాచారం. దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేసిన బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. మేలో షూటింగ్ ప్రారంభం కానుంది. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై రూపొందనున్న ఈ సినిమాకి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, కెమెరా: శ్యామ్ దత్ సైనుద్దీన్.
Comments
Please login to add a commentAdd a comment