Watch: Raviteja Ravanasura Movie Trailer Released Today, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ravanasura Trailer: 'నన్ను ఆపగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే'.. ఆసక్తిగా రావణాసుర ట్రైలర్

Published Tue, Mar 28 2023 4:38 PM | Last Updated on Tue, Mar 28 2023 5:12 PM

Raviteja Ravanasura Trailer Released Today - Sakshi

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రావణాసుర'. ఈ చిత్రానికి సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హీరో సుశాంత్‌ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. 

ట్రైలర్ ఫుల్ యాక్షన్‌ ఫైట్‌తో ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే ఈ చిత్రాన్ని యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ చివర్లో  'ఈ భూమ్మీద నన్ను ఆపగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే' అనే డైలాగ్ మాస్ ఆడియన్స్‌కు మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ సారి మాస్ మహా రాజా ఫ్యాన్స్‌కు మరోసారి ఫుల్ యాక్షన్‌ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement