Watch: Ravi Teja Dhamaka Movie DandaKadiyal Song Promo Goes Viral - Sakshi
Sakshi News home page

Dhamaka Movie Songs: రవితేజ ధమాకా నుంచి మరో మాస్‌ సాంగ్.. ప్రోమో అవుట్‌

Dec 6 2022 3:23 PM | Updated on Dec 6 2022 3:52 PM

Dandakadiyal Song Promo From Ravi Teja Dhamaka Out Now - Sakshi

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ధమాకా. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీం మరో అదిరిపోయే సాంగ్‌తో అప్‌డేట్‌ ఇచ్చింది.

ఈ చిత్రంలోని మరో ఫాస్ట్‌ బీట్‌  ‘దండకడియాల్‌’ సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. ఫుల్‌ సాంగ్‌ త్వరలోనే రానున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఇప్పటికే జింతాక్ సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తుంది. మరి దండకడియాల్‌ సాంగ్‌కు ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందన్నది చూడాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement