
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. తాజాగా రవితేజ కుటుంబం నుంచి కూడా ఓ వారసుడు సినీరంగ ప్రవేశం చేశాడు. మాస్ మహారాజ రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా టాలీవుడ్‌కు డెబ్యూ ఇవ్వనున్నారు. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాణి సమర్పణలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
'పెళ్లి సందడి' డైరెక్టర్ గౌరీ రోణంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైన ఈ సినిమా పూజా కార్యక్రమంలో కే రాఘవేంద్రరావు,సురేష్ బాబు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారు, దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరులు హాజరయ్యారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Wishing my boy #Maadhav all the very best for his debut :))))
— Ravi Teja (@RaviTeja_offl) March 23, 2023
May you all bless and shower him with all your love 🤗 #GowriRonanki #YalamanchiRani #JJREntertainmentsLLP pic.twitter.com/FBNvUsitiG
Comments
Please login to add a commentAdd a comment