
ఏ సినిమాలో అయినా క్లయిమాక్స్ ఫైట్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది. ప్రత్యేకించి ఆయా హీరోల అభిమానులైతే తమ హీరో విలన్లను రఫ్ఫాడిస్తుంటే విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. హీరో రవితేజ కూడా తన తాజా చిత్రం ‘రావణాసుర’ కోసం విలన్ల భరతం పడుతున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లు.
ఈ చిత్రంలో హీరో సుశాంత్ కీలక పాత్రధారి. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రూ.5 కోట్లతో వేసిన సెట్‌లో ఫైట్ వస్టర్ స్టన్ శివ నేతృత్వంలో క్లయిమాక్స్ ఫైట్ చిత్రీకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment