![Waltair Veerayya: Ravi Teja Performed Well as Powerful Police Officer - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/17/Waltair-Veerayya.jpg.webp?itok=RuAbKtOv)
మాస్ రాజా ఎన్ని క్యారెక్టర్స్ లో కనిపించినా రాని కిక్, ఒక్క పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తే ఇట్టే వచ్చేస్తుంది.రవితేజ ఎప్పుడు ఖాకీలో కనిపించినా సరే.. టాలీవుడ్ ఒక బ్లాక్ బస్టర్‌ను అందుకుంటోంది. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీలో అదే క్యారెక్టర్ రిపీటైనా రిజల్ట్ మాత్రం మారలేదు. వాల్తేరు వీరయ్యలో ఏసీపీ విక్రమ్ సాగర్ క్యారెక్టర్‌ను టెర్రిఫిక్‌గా చేశాడు మాస్ రాజా. అలా పోలీస్ క్యారెక్టర్ పవర్ చూపించాడు.
బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య పేరు మాత్రమే వినిపించడం లేదు, ఇదే సినిమాలో విక్రమ్ సాగర్ పాత్ర చేసిన వీరయ్య తమ్ముడి పేరు కూడా బాగా వినిపిస్తోంది. సెకండాఫ్‌లో వచ్చే ఈ క్యారెక్టర్‌ను చిరు ఎంత ప్రేమించాడో థియేటర్స్‌లో ఆడియెన్స్ కూడా అంతే ప్రేమిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా అంతా ఒక ఎత్తు.. చిరు, రవితేజ బాండింగ్ మరో ఎత్తు. అందుకే ఈ సినిమా ఈరోజు బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. మెగాస్టార్, మాస్ రాజా బాండింగ్‌తో పాటు, రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
విక్రమార్కుడులో రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ మాస్ రాజా ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. నాటి నుంచి నేటి వరకు రవితేజ ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ రోల్ చేసినా అదే యాంగర్ మెయింటైన్ చేస్తున్నాడు. పోలీస్ క్యారెక్టర్‌లో తనదైన పవర్ చూపిస్తున్నాడు.రెండేళ్ల క్రితం ఇదే సంక్రాంతి సీజన్‌లో క్రాక్‌లో రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ కరోనా టైమ్‌లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. రవితేజను పోలీస్ లుక్‌లో చూస్తే అభిమానులు కూడా అస్సలు ఆగలేరు.
Comments
Please login to add a commentAdd a comment