‘‘కరోనా అందరినీ చాలా ఒత్తిడికి గురి చేసింది. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం షూటింగ్స్‌ని కష్టంగా, కాస్త రిస్క్‌తో చేస్తున్నాం. సినిమా వాళ్లందరం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రేక్షకులు కూడా సినిమాను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉండటం చాలా సంతోషంగా అనిపిస్తోంది’’ అన్నారు శ్రుతీహాసన్. రవితేజ, శ్రుతి జంటగా నటించిన ‘క్రాక్’ గత శుక్రవారం రిలీజైంది. మూడేళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన శ్రుతీహాసన్ చెప్పిన విశేషాలు. (వారికి బాగా డబ్బులు రావాలి : రవితేజ )
చాలామంది ఇది కమ్‌బ్యాక్ అంటున్నారు. కానీ నేను కమ్‌బ్యాక్‌లా భావించడం లేదు. వర్క్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నాను. సినిమాలు చేయలేదు కానీ మ్యూజిక్ మీద మరింత శ్రద్ధ పెట్టాను. అలానే కొంచెం గ్యాప్ వచ్చింది కదా ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అని కాస్త టెన్షన్ అనిపించింది. కానీ ఎప్పటిలానే ప్రేమను, అభిమానాన్ని చూపిస్తున్నారు. ఈ మూడేళ్లలోనూ ఎప్పటికప్పుడు నాకు ప్రేమతో మెసేజ్‌లు పంపుతూనే ఉన్నారు. ప్రేక్షకులకు నా మీద ఉన్న ఆ ప్రేమ అలానే ఉంది. ‘క్రాక్’లో భాగమవ్వడం సంతోషంగా అనిపించింది. ‘బలుపు’ తర్వాత గోపీచంద్ మలినేని, రవితేజగారితో కలసి పని చేయడం మంచి అనుభవం. నా పాత్రను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నా పాత్రలో ఉన్న షేడ్స్‌ను షూటింగ్ అప్పుడు నేనూ బాగా ఎంజాయ్ చేశాను. ‘క్రాక్’ సమ్మర్‌లో రిలీజ్ కావాల్సింది. సడెన్‌గా కరోనా వైరస్ వచ్చింది. కానీ ప్రతీది ఓ కారణంతోనే జరుగుతుందేమో? థియేటర్స్‌కి ఆడియన్స్ వస్తారా? రారా? అని ఎక్కువ ఆలోచించలేదు. ఎందుకంటే మనం కష్టపడి పని చేస్తే దేవుడు, ప్రేక్షకులు చూసుకుంటారు అనుకున్నాను. అలానే జరిగింది.
లాక్‌డౌన్‌లో సుహాసినీగారి దర్శకత్వంలో ‘పుత్తమ్ పుదు కాలై’ అనే తమిళ ప్రాజెక్ట్ చేశాను. చిత్రీకరణ స్టార్ట్ అయ్యే ముందు మాస్క్ ఉందా? మొత్తం సేఫ్‌గా ఉన్నామా? అంటూ ఏదేదో ఆలోచించాను. కానీ నా పాత్రలోకి వెళ్ళిపోగానే ఇవేం పట్టించుకోలేదు. ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయాను.కొత్త సంవత్సరం ప్రత్యేకంగా నిర్ణయాలేమీ తీసుకోలేదు. ప్రతీ ఏడాదిలానే కష్టపడి పనిచేయాలి. మునుపటి కంటే నన్ను నేను మెరుగుపరుచుకోవాలి. మరింత సంతోషంగా ఉండాలి. సంక్రాంతి అనే కాదు ఏ పండగనూ ఎక్కువగా జరుపుకోను. కానీ సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మాత్రం ఫుడ్. చాలా రకాల వంటకాలు చేస్తారు ఇంట్లో. అలానే సంక్రాంతి అంటే చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ విశాలం ఆంటీ దగ్గరకు వెళ్లేదాన్ని. అక్కడ సంక్రాంతి జరుపుకునేవాళ్లం. ఇటీవలే ‘వకీల్‌సాబ్’ పూర్తి చేశాను. ఇందులో నాది గెస్ట్ రోల్. అలానే హిందీలో, తమిళంలో సినిమాలు చేస్తున్నాను. అన్ని ఇండస్ట్రీలను బ్యాలెన్స్ చేస్తున్నాను. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో వెబ్‌కి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. (సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. గెలిచేదెవరు? )
Comments
Please login to add a commentAdd a comment