
మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది అభిమానులున్నారు. ఆయనను స్ఫూర్తిగానే తీసుకొనే ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో రవితేజ కూడా ఒకరు. చిరులాగే స్వయంకృషితో పైకి వచ్చిన రవితేజ కెరీర్‌లో ఎన్నో హిట్స్, ఫ్లాప్స్ చూశారు. అయినా సరే, సరికొత్త కంటెంట్‌తో దూసుకుపోతున్నారు.
ధమాకాతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ రీసెంట్‌గా వాల్తేరు వీరయ్యతోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక తెరపైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లూ చిరంజీవి, రవితేజకు మంచి బాండింగ్ ఉంది. ఇటీవలె వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లోనూ ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా కనిపించారు.
నేడు(జనవరి26)న రవితేజ బర్త్‌డే సందర్భంగా చిరు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. 'నా తమ్ముడు రవితేజకి జన్మదిన శుభాకాంక్షలు. హాయిగా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా దీవించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను' అంటూ చిరు ట్వీట్ చేశారు.
నా తమ్ముడు రవితేజ @RaviTeja_offl కి జన్మదిన శుభాకాంక్షలు. హాయిగా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా దీవించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. pic.twitter.com/QmH0cAwg12
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2023
Comments
Please login to add a commentAdd a comment