
నటి, దర్శకురాలు రేణు దేశాయ్ తెలుగు సినిమాల్లో కనిపించిన చాలా కాలమే అయ్యింది. జానీ సినిమా అనంతరం ఇప్పటివరకు ఆమె సినిమాల్లో నటించలేదు. అయితే తాజాగా ఆమె వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారనే టాక్ వినిపిస్తుంది. రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరావు అనే చిత్రంలో కీలక పాత్ర కోసం రేణు దేశాయ్‌ని సంప్రదించారట. దీనికి ఆమె సైతం పాజిటివ్‌గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తుంది.
ఇందులో రవితేజ సిస్టర్‌గా రేణు దేశాయ్ కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. వంశీ కృష్ణ ఆకెళ్ల డైరెక్ట్ చేస్తున్న ఈ బయోపిక్ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.