Makers Announce Ravi Teja Ramarao On Duty Releasing Date On 2022 March 22- Sakshi
Sakshi News home page

Ravi Teja: రవితేజ ‘రామారావు ఆన్‌డ్యూటీ’ విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్‌

Published Mon, Dec 6 2021 12:17 PM | Last Updated on Mon, Dec 6 2021 12:31 PM

Makers Announce Ravi Teja Ramarao On Duty Releasing Date On 2022 March 22 - Sakshi

Ravi Teja Ramarao On Duty Release Date On 2022 March 22: మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌డ్యూటీ’. రవితేజ 68వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతోనే ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా, స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

కాగా ఇందులో మజిలీ బ్యూటీ దివ్యాన్ష కౌశిక్‌, రజిషా విజయన్‌లు కథానాయికలు. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరపుకుంటోన్న ఈ మూవీ విడుదల తేదీని తాజాగా మేకర్స్‌ ప్రకటించారు.  వచ్చే ఏడాది 2022 మార్చి 25న చిత్రం విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ చిత్రంలో తనికేళభరణి, నాజర్‌, సీనియర్‌ నటుడు నరేశ్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా రాహుల్‌ రామకృష్ణ సర్పట్టా ఫేం జాన్‌ విజయ్‌, చైతన్య కృష్ణ తదితరులు నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement