దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగిలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్‌ | Producer Dil Raju Son In Law Car Was Stolen Worth More Than Rs 1 Crore In Hyderabad - Sakshi
Sakshi News home page

Dil Raju Son In Law Car Stolen: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగిలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్‌

Published Sat, Oct 14 2023 7:39 AM | Last Updated on Sat, Oct 14 2023 12:39 PM

Dil Raju Son in Law Car Was Stolen - Sakshi

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అల్లుడు అర్చిత్ రెడ్డికి చెందిన రూ. 1.7 కోట్ల విలువైన పోర్షే కారును దొంగలించారు. దీంతో వెంటనే ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో​ గంటలోనే కారును గుర్తించి.. దొంగలించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అర్చిత్‌రెడ్డి శుక్రవారం ఉదయం  జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు తన పోర్షే కారులో వెళ్లారు. అక్కడ తన కారును బయటే పార్కింగ్‌ చేసి వెళ్లిన అర్చిత్‌ రెడ్డి సుమారు 30 నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు. ఆ సమయంలో తన కారు అక్కడ కనిపించలేదు.

దీంతో వెంటనే ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే సీఐ వీరశేఖర్‌, ఎస్సై రాజశేఖర్‌లు రంగంలోకి దిగారు. తమ సిబ్బందిని అలెర్ట్‌ చేసి నగరంలోని ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పలు సీసీ కెమెరాలను పరిశీలించగా  జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద కారు సిగ్నల్‌ జంప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఉన్న ట్రాఫిక్‌ పోలీసులను వారు అప్రమత్తం చేయడంతో కారు దొంగలించిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో పట్టుబడిన వ్యక్తి చెప్తున్న వివారలను తెలుసుకున్న పోలీసులు కంగుతిన్నారు.

(ఇదీ చదవండి: అభిమాని అలాంటి ప్రశ్న అడగడంతో ఫైర్‌ అయిన తమన్నా..)

పట్టుబడిన వ్యక్తి తాను ఆకాశ్‌ అంబానీ వ్యక్తిగత సహాయకుడినని, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కారును తీసుకెళ్లాలని సూచించడంతో దీనిని తీసుకెళ్తున్నట్లు చెప్పి పోలీసులను టెన్షన్‌ పెట్టాడు. అంతే కాకుండా తాను తన సహాయకుడు హృతిక్‌ రోషన్‌తో కలిసి కారులో అత్యవసరంగా అకాశ్‌ అంబానీని కలవడానికి వెళ్లాల్సి ఉందని, వదిలేయాలని పోలీసులతో చెప్పుకొచ్చాడు. 

దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక తలలుపట్టుకున్నారు. కొంత సమయం తర్వాత అతని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేయగా మతిస్థిమితం లేదని, కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్‌లోని బ్రైట్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సంస్థలో చికిత్స పొందినట్లు పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడు మన్సూరాబాద్‌ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు.

(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement