నందమూరి హీరోతో దిల్రాజు
నందమూరి హీరోతో దిల్రాజు
Published Tue, Apr 5 2016 1:33 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM
ఒకప్పుడు వరుస సూపర్ హిట్లతో మంచి ఫాంలో కనిపించి దిల్రాజు ఇటీవల కాలం ఆ స్ధాయిలో సక్సెస్లు సాధించలేకపోతున్నాడు. ఇటీవల దిల్రాజు బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలేవి ఆడియన్స్ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, దిల్రాజు మాత్రం తన రూట్ మార్చటం లేదు. గతంలో తన బ్యానర్లో ఫెయిల్ అయిన దర్శకులకు కూడా మరో అవకాశం ఇచ్చిన దిల్రాజు ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు.
పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో చాలా కాలం తరువాత మంచి సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు ఏయస్ రవికుమార్ చౌదరి. అయితే ఆ తరువాత రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేసిన సౌఖ్యం సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో చాలా రోజులుగా ఖాళీగా ఉంటున్న రవికుమార్ చౌదరికి మరో ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు దిల్రాజు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమా కోసం రెడీ అవుతున్న కళ్యాణ్ రామ్, ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. వెంటనే దిల్రాజు బ్యానర్లో తెరకెక్కనున్న సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు కళ్యాణ్. మరి దిల్రాజు సినిమాతో రవికుమార్ చౌదరి, కళ్యాణ్ రామ్ల కెరీర్లు గాడిలో పడతాయేమో చూడాలి.
Advertisement
Advertisement