
పోలీసులకు మాస్క్‌లు, శానిటైజర్లు అందిస్తున్న దిల్‌రాజ్
గోల్కొండ: ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన రోజు నుంచి నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులే రియల్ హీరోలని ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన మెహిదీపట్నం రైతుబజార్, ఆసిఫ్‌నగర్ డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు అందించారు. ఆయన వెంబడి పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ కే.సునిల్ తదితరులున్నారు.