సుప్రీమ్ రిలీజ్పై డైలమా | Dilraju, Sai dharam tej supreem release delayed | Sakshi
Sakshi News home page

సుప్రీమ్ రిలీజ్పై డైలమా

Published Wed, Mar 23 2016 11:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

సుప్రీమ్ రిలీజ్పై డైలమా - Sakshi

సుప్రీమ్ రిలీజ్పై డైలమా

పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల తరువాత మంచి ఫాంలో ఉన్న సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సుప్రీమ్. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని భావించినా, భారీ సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేయక తప్పలేదు. అంతేకాదు వరుసగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సుప్రీమ్ రిలీజ్పై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

మార్చి 25న ఊపిరి సినిమాతో టాలీవుడ్ స్క్రీన్ మీద సమ్మర్ సినిమా సందడి ప్రారంభమవుతోంది. తరువాత వరుసగా సర్దార్ గబ్బర్సింగ్, సరైనోడు, బ్రహ్మోత్సవం, కబాలి చిత్రాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. అన్నీ భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు కావటంతో ఒక్కో సినిమాకు రెండు వారాల గ్యాప్ కంపల్సరీ. దీంతో సుప్రీం రిలీజ్కు సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్నాడు నిర్మాత దిల్ రాజు.

ఇటీవల కృష్ణాష్టమి సినిమా విషయంలో కూడా బాగా ఆలస్యం చేసి ఇబ్బందులు పడ్డ దిల్ రాజు, ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఏప్రిల్ 10న పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆడియోను రిలీజ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ తరువాత సరైన గ్యాప్ చూసుకొని సినిమా రిలీజ్కు డేట్స్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement