వెంకీతో మెగా హీరో మల్టీ స్టారర్‌ | Anil Ravipudi Multistarrer with Sai Dharam tej Venkatesh | Sakshi
Sakshi News home page

వెంకీతో మెగా హీరో మల్టీ స్టారర్‌

Published Sun, Nov 12 2017 10:37 AM | Last Updated on Sun, Nov 12 2017 10:37 AM

Anil Ravipudi Multistarrer with Sai Dharam tej Venkatesh - Sakshi

గురు సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న విక్టరీ హీరో వెంకటేష్‌, మరో ఇంట్రస్టింగ్‌ సినిమాకు రెడీ అవుతున్నాడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఎఫ్‌ 2(ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) అనే సినిమాకు ఓకె చెప్పాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా మల్టీస్టారర్‌ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీతో పాటు ఓ యువ కథానాయకుడు నటించనున్నాడు. అయితే ఆ యంగ్‌ హీరో ఎవరన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

కొద్ది రోజులుగా మామ అల్లుళ్లు వెంకటేష్‌, నాగచైతన్యల కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ మూవీ తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. వెంకీతో నటించబోయే యంగ్‌ హీరో నాగచైతన్య కాదట. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో నటించేందుకు అంగీకరించాడట. దిల్‌రాజు పాటు అనిల్‌ రావిపూడితో మంచి అనుబంధం ఉన్న సాయి, ఈ క్రేజీ మల్టీ స్టారర్‌ కు ఓకె చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ టాక్‌ నిజమో కాదో తెలియాలంటే మాత్రం అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement