మెగా హీరోతో భోజ్పురి స్టార్ | ravi kishan to play comic vilain in sai dharam tej supreem | Sakshi
Sakshi News home page

మెగా హీరోతో భోజ్పురి స్టార్

Published Tue, Nov 10 2015 2:01 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

మెగా హీరోతో భోజ్పురి స్టార్ - Sakshi

మెగా హీరోతో భోజ్పురి స్టార్

'రేసుగుర్రం' సినిమాతో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికిషన్ మరో క్రేజ్ ప్రాజెక్ట్లో నటిస్తున్నాడు. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన రవికిషన్ తరువాత చేసిన 'కిక్ 2'తో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే మరోసారి సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'సుప్రీమ్' సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

'పటాస్' ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సుప్రీమ్'. ఈ సినిమాలో కామెడీ టచ్ ఉన్న నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు రవికిషన్. 'రేసుగుర్రం' సినిమాలోనూ ఇదే తరహా పాత్రలో కనిపించిన రవికిషన్, మరోసారి తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

సాయి ధరమ్ తేజ్ సరసన  రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దిల్రాజు నిర్మిస్తున్నాడు. 'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాల తరువాత సాయిధరమ్ చేస్తున్న సినిమా కావటంతో 'సుప్రీమ్' పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు అనిల్ రావిపూడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement