Actor Rajendra Prasad Tests Covid Positive, Details Inside - Sakshi
Sakshi News home page

Rajendra Prasad Covid19: నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్‌కు కరోనా..

Published Sun, Jan 9 2022 3:23 PM | Last Updated on Sun, Jan 9 2022 3:39 PM

Senior Actor Rajendra Prasad Tested Positive For Covid 19 - Sakshi

Senior Actor Rajendra Prasad Tested Positive For Covid 19: దేశంలో కరోనా, మెలిమెల్లిగా తన పంజా విసురుతోంది. ఏ రోజుకీ ఆరోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరినీ మహామ్మారి విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే బాలీవుడ్‌, టాలీవుడ్‌లో అనేకమంది ప్రముఖులు కొవిడ్‌ బారిన పడ్డారు. బీటౌన్‌లో ఏక్తా కపూర్, అర్జున్‌ కపూర్‌, స్వరా భాస్కర్‌, సింగర్ విశాల్ డడ్లానీతో పాటు టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబుకు కరోనా సోకడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. వీరే కాకుండా త్రిష, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు, సీనియర్‌ హీరో నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌ కరోనా బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. రాజేంద్ర ప్రసాద్‌ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: బుల్లితెర హీరోయిన్‌కు కొవిడ్‌.. అవి నమ్మొద్దని సలహా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement