గాలిపటం హీరోయన్‌, ఆమె తల్లికి కరోనా.. అవి నమ్మొద్దని సలహా | Erica Fernandes And Her Mother Tested Positive For Covid 19 | Sakshi
Sakshi News home page

Erica Fernandes: బుల్లితెర హీరోయిన్‌కు కొవిడ్‌.. అవి నమ్మొద్దని సలహా

Published Wed, Jan 5 2022 4:50 PM | Last Updated on Wed, Jan 5 2022 4:57 PM

Erica Fernandes And Her Mother Tested Positive For Covid 19 - Sakshi

Erica Fernandes And Her Mother Tested Positive For Covid 19: బాలీవుడ్‌ బుల్లితెర హీరోయిన్‌ ఎరికా ఫెర్నాండెజ్‌ బుధవారం కరోనా సోకినట్లు తెలిపింది. ఆమెతోపాటు తన తల్లికి కూడా కొవిడ్‌ 19 పాజిటివ్‌ వచ్చినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలిపింది. కరోనా పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్ వచ్చినట్లుగా ఎరికా పేర్కొంది. అయితే ముందుగా తాను హోమ్‌ కిట్స్‌తో పరీక్షలు చేసుకోగా నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపింది. అయినా దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గకపోగా ఎక్కువ కావడంతో ల్యాబ్‌లో పరీక్షించికున్నట్లు వెల్లడించింది. ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలిందని ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చింది ఎరికా. 



ఇదీ చదవండి: ప్రముఖ సీరియల్‌ నటికి కరోనా.. త్వరగా కోలుకోవాలని సందేశాలు

తన పోస్టులో 'కొవిడ్‌ నాకు వచ్చిందని తెలిసి మొదట భయపడ్డాను. కానీ మనలో చాలా మందికి త‍్వరగా లేదా ఆలస్యంగా అయిన సంక్రమిస్తుందని తెలుసు. దురదృష్టవశాత్తు మా అమ్మకు కూడా పాజిటివ్‌ వచ్చింది. నా సలహా ఏంటంటే హోమ్‌ టెస్ట్‌ (కోవి సెల్ఫ్‌ కిట్‌)తో పరీక్షలు చేసుకోకండి. ఎందుకంటే అవి నమ్మదగినవి కావు. జనవరి 2న నాకు దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. నేను కోవి సెల్ఫ్‌ కిట్‌లో పరీక్షించుకున్నాను. మొత్తం మూడు సార్లు నెగెటివ్ అని వచ్చింది. నాతోపాటు మా అమ్మకు కూడా నెగెటివ్‌ అని వచ్చింది. కానీ నా ఆరోగ్యం అంతా బాగున్నట్టు అనిపించలేదు. ఎందుకంటే ఈసారి గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఎక్కువయ్యాయి. వీటితోపాటు వణకడం కూడా మొదలైంది.' అని ఎరికా ఫెర్నాండెజ్‌ తెలిపింది. 


 


ఈ పోస్ట్‌ చూసిన ఆమె అభిమానులు, సన్నిహితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఎరికా ఫెర్నాండెజ్ తెలుగులో 'గాలిపటం' సినిమాలో ఒక హీరోయిన్‌గా స్వాతి పాత్రలో అలరించింది. ఇదిలా ఉంటే ఇప్పటికీ బాలీవుడ్‌లో నోరా ఫతేహీ, ఏక్తా కపూర్‌, సోనూ నిగమ్‌, అర్జున్‌ కపూర్‌, రియా కపూర్‌, ద్రష్టి ధామి, జాన్ అబ్రహం, అతని భార్య ప్రియా రుంచల్‌ తదితర ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్‌ హీరోయిన్‌.. 2 సార్లు నెగెటివ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement