
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. శనివారం అర్ధరాత్రి ఆమె మరణించారు. అయితే, కొంత సమయం క్రితం హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. గాయత్రికి మొదట ఛాతీ వద్ద నొప్పి రావడంతో వెంటనే ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆమె మరణించారు.
కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్ వద్ద ఇందూ విల్లాస్‌లో ఉంటున్న రాజేంద్రప్రసాద్ నివాసంలో గాయత్రి భౌతికకాయాన్ని ఉంచారు. ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలిపిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం గాయత్రి అంత్యక్రియలు జరిగాయి. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్ కైలాస వాసంలో కుటుంబ సభ్యుల మధ్య గాయత్రి అంత్యక్రియలు ముగిశాయి. అక్కడ కూతురు భౌతికకాయాన్ని చూసి రాజేంద్రప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment