
సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. కూకట్‌పల్లిలోని ఇందు విల్లాస్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రభాస్ కూతురి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గాయత్రి చిత్రపటానికి ప్రభాస్ నివాళులర్పించారు.
కాగా.. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో రాజేంద్రప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు. కూతురిపై ప్రేమతో తానే స్వయంగా రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించి ఇచ్చారాయన.

Comments
Please login to add a commentAdd a comment