హీరో అనే పదానికి అర్థాలు మారిపోయాయి. సద్గుణాలు, విలువలు కలిగినవారే ఒకప్పుడు హీరోలు. కానీ ఇప్పుడు జులాయిగా, చెడు అలవాట్లు ఉండి, అడ్డదారులు తొక్కేవారిని కూడా హీరో పాత్రలుగా చిత్రీకరిస్తున్నారు. జనాలు కూడా ఈ నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోలనే ఇష్టపడుతున్నారు. అయితే పుష్ప 2 సినిమాను కూడా ఈ జాబితాలోనే వేసేశాడు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్.
చందనం దొంగ హీరో
హరికథ వెబ్ సిరీస్ ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకు వచ్చేశాం. ఈ కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న వాడెవడో చందనం దొంగ హీరో.. సరే, ఈరోజుల్లో హీరో అనే పదానికి అర్థాలే మారిపోయాయి.
నేను 48 ఏళ్లుగా హీరో
నా అదృష్టం ఏంటంటే.. 48 సంవత్సరాలుగా నేనొక డిఫరెంట్ హీరోగా వస్తున్నాను. సమాజంలో మన చుట్టూ ఉన్నవాళ్లు పాత్రలనే ఆధారంగా తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్నాను అని చెప్పుకుంటూ పోయాడు. అయితే చందనం దొంగ అనగానే అందరికీ పుష్ప సినిమా గుర్తుకురావడం ఖాయం. రాజేంద్రప్రసాద్ హీరో పోషించిన పాత్ర గురించి అన్నప్పటికీ దీనిపై అల్లు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇకపోతే హరికథ వెబ్ సిరీస్ డిసెంబర్ 13న హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment