
ఓటీటీలు రావడంతో డిఫరెంట్ కాన్సెప్ట్ కథలు చెప్పడం కూడా మొదలుపెట్టారు. అలా సినిమాలుగా తీయలేని కథల్ని కొన్నిసార్లు వెబ్ సిరీసులుగా తీయడం చూస్తూనే ఉన్నాయి. అలా రాజేంద్ర ప్రసాద్, దివి, శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన సిరీస్ పేరే 'హరికథ'. ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‍బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?)
మర్డర్ మిస్టరీకి మైథలాజికల్ టచ్ ఇచ్చి తీసిన ఈ సిరీస్ డిసెంబరు 13 నుంచి హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అధర్మం హద్దు మీరినప్పుడు, అన్యాయాన్ని ఎదురించాల్సిన వారు చేతులు కట్టుకొని కూర్చున్నప్పుడు.. ఆ ధర్మాన్ని కాపాడడానికి దేవుడే వస్తాడు అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. అదే టైంలో రక్తపాతంతో భయంకరంగా అనిపించింది.
పరశురాముడు, నరసింహుడు, వామనమూర్తి... ఇలా శ్రీవిష్ణు దశావాతారాల్లోని కొన్ని రూపాల్లో ఉన్న వ్యక్తి.. వరస హత్యలు చేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఉన్నది దేవుడా? మరెవరైనా అని పరిశోధించే పోలీస్ ఆఫీసర్‌గా శ్రీ రామ్ నటించారు. రంగస్థల నాటక కళాకారునిగా రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.
(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!)
Comments
Please login to add a commentAdd a comment